హైకోర్టు సీరియస్ అయ్యింది. లక్షలాది మంది బాధితులకు సంబంధించి విషయంలో ఏపీ సర్కారు ఏం చేస్తున్నారంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అగ్రిగోల్డ్ విషయంలో బాబు సర్కారు ఏం చేసిందని ప్రశ్నించిన హైకోర్టు.. ఈ కేసు విచారణాధికారిని తక్షణమే మార్చాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి సీఐడీ దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు.. ఈ కేసులో ఇప్పటివరకూ ఎంతమందిని ప్రశ్నించారు? ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
ఈ కేసులో రెండు నెలలుగా ఎవరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ సూటిగా ప్రశ్నించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలాన్ని 15 రోజుల్లో స్టార్ట్ చేయాలని చెబుతూ.. మంగళవారానికి కేసును వాయిదా వేసింది. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా తాము వదిలేది లేదని.. కఠిన చర్యలు తప్పవంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండలిలో వ్యాఖ్యలు చేస్తున్న సమయానికి కాస్త అటూఇటూగా హైకోర్టు ఏపీ సర్కారు తీరును ప్రశ్నించటం గమనార్హం. అగ్రిగోల్డ్ వ్యవహారంలో హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో.. బాబు సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.