ప్రభుత్వం నుంచి తీసుకునే అనుమతికి.. కట్టే నిర్మాణానికి సంబంధం లేకుండా.. ఇష్టం వచ్చినట్లుగా భవనాల్ని నిర్మించటం రెండు తెలుగు రాష్ట్రాల్లో కామనే. ఏమైనా అయితే.. అంతో ఇంతో పీనల్ ఛార్జిలు కట్టేయటం.. అంతకు ముందే అధికారులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇచ్చేస్తే ఇష్యూ క్లోజ్ అవుతుందన్న భావన చాలామందిలో ఉంది.
ఇలాంటివి మనసు నుంచి తొలగించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే నిర్మాణాల విషయంలో తాజాగా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
నిర్మాణంలో జరిగిన ఉల్లంఘనలను నిర్మల్ మున్సిపల్ కమిషనర్ క్రమబద్ధీకరించకపోవటాన్ని సవాల్ చేస్తూ.. ఆదిలాబాద్ జిల్లా బాగులవాడకు చెందిన రాజన్న అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా తన వాదనను వినిపిస్తూ.. గతంలో ఇలానే రూల్స్ కు ఉల్లంఘిస్తూ నిర్మించిన నిర్మాణాలకు జరిమానా విధించి క్రమబద్ధీకరించాలంటూ 2012లో సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. అదే రీతిలో మీరుకూడా ఇవ్వాలన్న వాదనను వినిపించారు. దీనిపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. భవన నిర్మాణాలకు సంబంధించి ప్రతి ఉల్లంఘనను జరిమానాతో సరిపెడుతూ వెళితే.. ఇక నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు.. నిబంధనల అవసరం ఉండదని మండిపడింది. ఎవరికి వారు అక్రమంగా ఇళ్లు నిర్మించుకొని జరిమానా చెల్లించుకుంటూ పోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. మౌలిక వసతుల లభ్యతకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ అవసరం లేదని పేర్కొంది.
పిటిషనర్ వాదనను జస్టిస్ చల్లా కోదండరాం విచారణ చేస్తూ.. చేసిన వ్యాఖ్యలు రానున్న రోజుల్లో అక్రమ నిర్మాణాల విషయంలో కోర్టులు ఎంత కఠినంగా వ్యవహరిస్తాయన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసిందని చెప్పాలి. హైకోర్టు న్యాయమూర్తి చేసిన తీవ్ర వ్యాఖ్యల్లో ముఖ్యమైనవి చూస్తే..
+ మాస్టర్ ప్లాన్ అంటే శాస్త్రీయంగా ఇంజినీర్లు రూపొందిస్తారు. జనాభా ఆధారంగా తాగునీరు - రోడ్లు - డ్రైనేజీ - విద్యుత్తు తదితర సౌకర్యాలను కల్పిస్తారు. వీటి ఆధారంగా ఎంత మంది ఉండాలి - అనుమతులు ఎలా ఇవ్వాలన్నది అక్కడ వనరులను బట్టి నిర్ణయిస్తారు. ప్రతి ఉల్లంఘనను జరిమానాతో సరిపెట్టి నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తూ పోతే ఇక మాస్టర్ ప్లాన్ ఉండీ ప్రయోజనం లేనట్లే
+ 2012నాటి సింగిల్ జడ్జి ఉత్తర్వుల ఆధారంగా అక్రమ నిర్మాణాలను సమర్థిస్తూ వెళితే ప్రజలు కూడా ముందు అక్రమంగా నిర్మాణాలు పూర్తి చేసి తరువాత జరిమానా చెల్లించి క్రమబద్ధీకరించుకుందామన్న అభిప్రాయానికి వస్తారు.
+ మౌలిక నిర్మాణాలైన రోడ్లు - మురుగునీటి పైపులు - విద్యుత్తు తదితర సౌకర్యాలను పరిగణనలోకి తీసుకుని దానికి అనుగుణంగా ప్రణాళికను రూపొందించి కార్పొరేషన్‌లు అనుమతులు మంజూరు చేస్తాయి. మాస్టర్ ప్లాన్ లో చదరపు అడుగు/గజానికి ఎంత జనాభా ఉండాలన్నది శాస్త్రీయంగా అంచనా వేస్తారు.
+ క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించే మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని 340 - 455 ఏ - 455ఏఏ సెక్షన్ లకు ఏపీ పట్టణాభివృద్ధి చట్టం 1975తోపాటు రాజ్యాంగంలోని అధికరణ 300కు పొంతన కుదరడంలేదు. సగటు పౌరుడికి రాజ్యాంగం - చట్టం ప్రకారం దక్కే హక్కులకు.. అదే విధంగా ఉల్లంఘనలకు పాల్పడే వారి హక్కుల విషయంలో పొంతన కుదరడంలేదు. ఇక్కడ చట్టంలోని నిబంధనలను సవాలు చేయనందున పూర్తి వివరాలను పరిశీలించాల్సి ఉంది. అందువల్ల దీన్ని ధర్మాసనానికి నివేదించాలి.