భార్యతో గొడవలు.. విమానాన్ని హైజాక్ చేశాడు..

Update: 2019-02-25 10:55 GMT
పెళ్లాంతో గొడవ అతడిని ఉన్మాదిగా మార్చింది. విచక్షణ కోల్పోయేలా చేసింది. చివరికి మానసికంగా దెబ్బతిని విమానాన్ని హైజాక్ చేసేలా చేసింది. బంగ్లాదేశ్ ఎయిర్ లైన్స్ విమానం ఛత్రోగామ్ విమానాశ్రయం నుంచి బయలు దేరగానే హైజాక్ కు గురైంది. గన్ తో విమానంలోకి ఎక్కిన దుండగుడు తుపాకీతో బెదిరించాడు. తనకు భార్యతో గొడవలున్నాయని.. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో తనను వెంటనే మాట్లాడించాలంటూ విమానాన్ని హైజాక్ చేశాడు.

అయితే వెంటనే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని ఛత్రోగామ్ విమానాశ్రయంలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.అనంతరం పోలీసులు చాలా సేపు హైజాకర్ తో చర్చలు జరిపారు. ప్రయాణికులను విమానం నుంచి దింపేందుకు హైజాకర్ ఒప్పుకోవడంతో వారిని అత్యవసర ద్వారం గుండా బయటకు తీసుకొచ్చారు. అనంతరం కమాండోలు రంగ ప్రవేశం చేసి హైజాకర్ ను లొంగిపోవాలని కోరారు. కానీ ఒప్పుకోకపోవడంతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో హైజాకర్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడిని బంగ్లాదేశ్ కు చెందిన మహదిగా గుర్తించారు.

ఈ మొత్తం వ్యవహారంలో ఉగ్రకోణం లేదని.. మహది అనే వ్యక్తి భార్యతో మనస్పర్థల కారణంగా  ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

Tags:    

Similar News