అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరెత్తినా, ఆయన నిర్ణయాలను ప్రస్తావించినా నొసలు చిట్లించే వారి సంఖ్య ఎక్కువ. విదేశీయులయితే ట్రంప్ నిర్ణయాలపై బెంబెలెత్తిపోతున్నారు. అయితే ట్రంప్‌ను పలువురు ఇలా వ్యతిరేకిస్తుంటే... ఆయన బర్త్ డే వేడుకల ను ఘనంగా నిర్వహించేందుకు హిందూ సేన సన్నద్ధమైంది. ట్రంప్‌ను 'మానవతా పరిరక్షకుడు'గా అభివర్ణిస్తూ 'రాజ్ తిలక్' సెర్మనీ పేరుతో హిందూసేన బుధవారంనాడిక్కడ అట్టహాసంగా నిర్వహించింది. ఈ సంస్థ గత ఏడాది కూడా ట్రంప్ బర్త్ డే వేడుకలను నిర్వహించింది.
ట్రంప్ బుధవారం 71వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఇక్కడి జంతర్ మంతర్ వద్ద హిందూసేన నిర్వహిస్తున్న వేడకలో ఆయన 'ఫొటో ఎగ్జిబిషన్'ను కూడా ఏర్పాటుచేస్తున్నారు. ట్రంప్ చిన్నప్పటి ఫోటో, ప్రస్తుత ఫోటోతో ఉన్న పోస్టర్‌ను కూడా పుట్టినరోజు వేడుకల కోసం ప్రచురించారు. బుధవారం రాజధానిలో జరిగే వేడుకలకు హాజరుకావాల్సిందిగా కోరుతూ ఈ పోస్టర్ ను వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో హిందూసేన విస్తృతంగా ప్రచారం చేస్తోంది. '2016లో నిర్వహించిన కార్యక్రమంకన్నా ఈసారి భారీ ఎత్తున ఆయన జన్మదిన ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాం. గత ఐదేళ్లలో ట్రంప్ విజయపరంపరల ప్రస్థానాన్ని తెలియజేసే ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం' అని హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా చెప్పారు. గతేడాది ఇదే సమయంలో రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ పోటీలో ఉన్నారు. ఆయన విజయాన్ని కాంక్షిస్తూ హిందూసేన 'హెవెన్' పేరిట 2016లో కార్యక్రమాన్ని నిర్వహించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/