కరోనా లాక్ డౌన్ కారణంగా గత 40 రోజులుగా మందు చుక్క లేక బిక్కుబిక్కుమంటూ బ్రతికిన మందుబాబులకు ..లాక్ డౌన్ నుండి మద్యం దుకాణాలకు సడలింపు ఇచ్చి శుభవార్త చెప్పింది ప్రభుత్వం. అయితే, తాజాగా మందుబాబులకి మరో శుభవార్త. చాలారోజుల తరువాత వైన్ షాపులు తెరవడంతో చుక్క కోసం గంటల తరబడి నిరీక్షించి మరీ కొనుగోలు చేస్తున్నారు. అయితే ఫుడ్ డెలివరీ సంస్థ.. జొమాటో మద్యం డెలివరీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది.
చాలారోజుల తరువాత వైన్ షాపులు తెరవడంతో మందు షాప్స్ ముందు చాలా మంది సామజిక దూరం పాటించకుండా నిల్చొవడంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. లిక్కర్ పై ఢిల్లీ ప్రభుత్వం 70 శాతం సెస్ వేయగా, మహారాష్ట్ర ప్రభుత్వం మూసివేయాలని నిర్ణయం తీసుకున్నది. మద్యం రేట్లు భారీగా పెంచినప్పటికీ కూడా మందుబాబులు షాప్స్ ముందు భారీగా క్యూ కట్టడంతో పోలీసులు కూడా వారిని కొన్ని చోట్ల అదుపు చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మద్యాన్ని హోం డెలివరీ చేయాలనీ కొన్ని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి.
కాగా , జొమాటో ఇప్పటికే కిరాణా వస్తువులను కూడా అందజేస్తోంది. లాక్ డౌన్ వల్ల రెస్టారెంట్లు మూసివేయడంతో వినియోగదారులకు సరుకులు ఇస్తోంది. దేశంలో ప్రస్తుతం ఆల్కహాల్ డెలివరీ చేసేందుకు చట్టపరమైన నిబంధణలు లేవు. కానీ ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాత్రం జొమాటో ఇతర సంస్థల ద్వారా విక్రయాలు జరిపించాలని అనుకుంటోంది. లిక్కర్ హోం డెలివరీ ద్వారా మందు వినియోగం బాధ్యతయుతంగా జరుగుతోందని జొమాటో భావిస్తోంది.
కరోనా వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లో డెలివరీ చేసేందుకు జొమాటో సిద్దంగా ఉంది అని రాయిటర్స్ నివేదించింది. కానీ దీనిపై జొమాటో యాజమాన్యం మాత్రం స్పందించలేదు. లిక్కర్ డెలివరీ ద్వారా రాష్ట్రాలకు ఆదాయం సమకూరుతోందని ఐఎస్‌డబ్లూఏఐ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అమ్రిత్ కిరణ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఇకపోతే, చైనాకు చెందిన అలీబాబా గ్రూపు అనుబంధ సంస్థ యాంట్ ఫైనాన్షియల్ మద్దతుతో జొమాటో దేశలో విస్తరిస్తోంది. జనవరిలో ఉబెర్ ఈట్స్ కూడా కొనుగోలు చేసింది. జొమాటో ప్రధాన ప్రత్యర్థి స్విగ్గీ.. దీనికి చైనాకు చెందిన టెన్సెంట్ సపోర్ట్ చేస్తోంది.