తెలంగాణలో రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీకే వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఇప్పుడు హోం శాఖ ఉన్నతాధికారులలో కూడా టెన్షన్ పట్టుకుంది .గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న హోం శాఖ మంత్రి మహమూద్ అలీకి వైరస్ నిర్దారణ పరీక్షలు చేయగా ..వైరస్ పాజిటివ్ గా తేలడంతో గత గురువారం నాడు ఆయనతో కలిసి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న పోలీసు ఉన్నతాధికారులకు వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
గురువారం తెలంగాణ రాష్ట్రంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ గోషా మహల్ పోలీసు స్టేడియంలో మొక్క నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ,హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ , డీసీపీలు,ఏసీపీలు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి మహమూద్ అలీకి వైరస్ పాజిటివ్ గా రావడంతో అందరూ టెన్షన్లో పడ్డారు .
గురువారం నాటికే అనారోగ్యంతో ఉన్న మహమూద్ అలీ ఆ తర్వాత ఆస్తమాతో ఇబ్బందిపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఆయన దగ్గర పనిచేసిన గన్ మెన్ లకు, వ్యక్తిగత సిబ్బందికి, ఆయన కుటుంబ సభ్యులకు వైరస్ పాజిటివ్ గా తేలడంతో శుక్రవారం నాడు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు వైరస్ టెస్ట్ లు ఇచ్చారు . వారి రిపోర్టుల విషయంలో ప్రస్తుతం ఆందోళన నెలకొంది. ఆ రోజు హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ అధికారులు అందరూ ప్రస్తుతం వైరస్ టెస్ట్ చేయించుకుంటున్న పరిస్థితి ఉంది. చాలా మంది అధికారులు ఇప్పటికే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిని ఇప్పటి వరకు కలిసిన వారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం వీరందరి టెస్టులపై , వీరితో కాంటాక్ట్ అయిన వారు ఎవరన్న దానిపై దృష్టి సారించారు అధికారులు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ పోలీసు శాఖను కరోనా వెంటాడుతోంది. పోలీస్ అకాడమీ లో తాజాగా 180 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏకంగా హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కే పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఇటీవలకాలంలో ఆయనను కలిసిన పోలీసు ఉన్నతాధికారులు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. వైరస్ పోరాటంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పోరాటం చేసిన పోలీసులు సైతం వైరస్ కాటుకి గురౌతుండటంతో వారిలో కూడా భయం మొదలైంది.