కరోనా భయంతో పేషెంట్ ను చేర్చుకోని ఆస్పత్రులు

Update: 2020-03-20 05:03 GMT
కరోనా వైరస్ భయం అందర్నీ వెంటాడుతోంది. దీంతో ఎవరు తుమ్మినా.. దగ్గినా.. జ్వరంగా ఉన్నా వెంటనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారికి దూరంగా జరుగుతున్నారు. కరోనానా అంటూ సంశయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా కరోనా సోకిన వారికి దూరంగా ఉంటున్నారు. తాజాగా ఒక ప్రాంతంలో కరోనా లక్షణాలు ఉన్నాయని ఒక వైద్యుడికే కొన్ని ఆస్పత్రులు వైద్యం అందించడానికి నిరాకరించాయి. కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని నాలుగు ఆస్పత్రులు అతడిని చేర్చుకోమంటూ తిరస్కరించారు. అప్పటికి అతడి ఆరోగ్యం క్షీణించింది. చివరకు అతడిని చివరకు ప్రభుత్వ వైద్య కళాశాలలో చేర్చుకున్నారు. అయితే ప్రస్తుతం అతడు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు.

దేశంలోనే అత్యధికంగా 49 కేసులు నమోదైంది మహారాష్ట్రలోనే. ఈ COVID-19 భయం తో ప్రైవేట్ ఆస్పత్రులు వైద్యం ఇవ్వడానికి నిరాకరిస్తుననాయి. కరోనా లక్షణాలు కనిపించగానే తమ ఆస్పత్రుల్లో చేర్చుకోమంటూ చేతులెత్తేశారు. ఇలాంటి ఘటనే కొల్హాపూర్ నుంచి సొంత గ్రామమైన భుసావాల్‌కు వెళ్లాడు. ఆ క్రమంలో జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి వెళ్లగా సిబ్బంది లేకపోవడం తో ఇంటెన్సివ్ కేర్ ఆస్పత్రికి వెళ్లారు. ఆ వైద్యులు అతడికి కరోనా ఉంటే అది హాస్పిటల్ మొత్తం వ్యాపిస్తుందని చేర్చుకునేందుకు నిరాకరించారు. దాంతో రోగిని ఆ కుటుంబం మరో మూడు ఆస్పత్రులకు తిరిగింది. ఆస్పత్రిలో చేర్చుకునేందుకు ఇలా నాలుగు ఆస్పత్రులు నిరాకరించాయి. రాత్రంతా అక్కడ ఉన్న ఆస్పత్రుల చుట్టూ ఆ కుటుంబసభ్యులు తిరిగారు.

చివరకు తెల్లవారుజామున ప్రభుత్వ వైద్య కళాశాలలో చేరారు. అయితే తీవ్రంగా అలసిపోవడం.. వైద్యం సకాలంలో అందకపోవడం తో అతడు నీరసించడం తో వెంటనే అతడికి వెంటిలేటర్ తో చికిత్స అందిస్తున్నారు. అక్కడ ఉన్న సదుపాయాలకు మించి వైద్య సహాయం అందించాలని మరెక్కడికైనా తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. ఆ కుటుంబసభ్యులు దిక్కులేక జిల్లా కలెక్టర్ను కలిశారు. దీంతో కలెక్టర్ ఆ ఆస్పత్రిలోనే అతడికి మెరుగైన సేవలందించాలని ఆదేశాలిచ్చారు. అతడికి కరోనా లేదని.. సాధారణ పరీక్షలు చేయాలని వైద్యులు నిర్ధారించారు. ఈ విధంగా కరోనా భయం తో ఒక రోగికి వైద్యం నిరాకరించిన ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. ప్రభుత్వాలు మాత్రం ప్రతి రోగిని చేర్చుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచిస్తున్నా అవి పట్టించుకోవడం లేదు. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యిందని సమాచారం. ఇక ప్రతి రోగికి వైద్యం అందించాలని, తప్పనిసరిగా చేర్చుకోవాలనే ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది.
Tags:    

Similar News