ఆంధ్రప్రదేశ్‌లో ఒక హత్య కేసులో జీవిత ఖైదు పడిన నేరస్తులను కనీసం 14 ఏళ్ల శిక్ష పూర్తి కాకుండానే క్షమాభిక్ష కింద విడుదల చేయడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. నిబంధనలు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. జీవిత ఖైదు పడిన వారు కనీసం 14 ఏళ్లు జైలు జీవితం అనుభవిస్తేనే క్షమాభిక్షకు అర్హులని హైకోర్టు Ðð ల్లడించింది. జగన్ ప్రభుత్వ ఆదేశాలను పరిశీలిస్తే.. ఈ శిక్షను కుదించినట్టుగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై వాదనలు వినిపించాలని స్పష్టం చేస్తూ విచారణను ఆగస్టు 25కి వాయిదా వేసింది.
తన భర్త పార్థమరెడ్డిని హత్య చేసి జీవిత ఖైదు అనుభవిస్తున్న ఎనిమిది మంది నేరస్తులను స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా జగన్ ప్రభుత్వం క్షమాభిక్షపై విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామానికి చెందిన ముడి నవనీతమ్మ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు.
క్షమాభిక్ష కింద బయటకు వచ్చిన పుచ్చలపల్లి నరేశ్‌రెడ్డి, కొండూరు దయాకర్‌రెడ్డి, పుచ్చలపల్లి శ్రీనివాసులురెడ్డి, పుచ్చలపల్లి నిరంజన్‌రెడ్డి, పుచ్చలపల్లి సుబ్రమణ్యంరెడ్డి, యల్లసిరి మస్తాన్, కలతూరు సుధాకర్‌రెడ్డి, చెన్నూరు వెంకటరమణారెడ్డిలను తిరిగి జైలుకు పంపాలని నవనీతమ్మ కోర్టును అభ్యర్థించారు.
ఈ నేరస్తులకే క్షమాభిక్ష ప్రసాదిస్తూ గతేడాది ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వం వారిని విడుదల చేయబోగా ఆమె అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పట్లో ఆ ప్రక్రియ ఆగిపోయింది. మళ్లీ తిరిగి ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 15న ఆ ఎనిమిది మంది నేరస్తులను విడుదల చేసింది. దీంతో ఆమె అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు.
కాగా పిటిషనర్ తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. ఆ ఎనిమిది మంది నేరస్తుల్లో కొందరు 8 ఏళ్లు, మరికొందరు 11 ఏళ్ల శిక్ష పూర్తి చేసుకున్నారని తెలిపారు. కనీసం 14 ఏళ్ల శిక్ష అనుభవించకుండానే వారిని ప్రభుత్వం విడుదల చేసిందని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఖైదీల విడుదలలో ఎలాంటì నిబంధనల ఉల్లంఘన చోటు చేసుకోలేదన్నారు. గవర్నర్ ఆయనకున్నæ అధికారాల మేరకే ఖైదీలను విడుదల చేశారని చెప్పారు. ఆ వాదనలను తోసిపుచ్చిన న్యాయమూర్తి.. జీవిత ఖైదు శిక్ష పడిన వారు కనీసం 14 ఏళ్ల జైలు జీవితం అనుభవించాలని తేల్చిచెప్పారు. అంతేకాకుండా సత్ప్రవర్తన కలిగి ఉంటేనే క్షమాభిక్షకు అర్హులని స్పష్టం చేశారు.