ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం మళ్లీ వాయిదా పడింది. పంపిణి భూములపై కోర్టుల్లో కేసులు ఉండటంతో ఈ కార్యక్రమాన్ని మరోసారి ప్రభుత్వం వాయిదా వేసింది. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఈ నెల 15న జరగడం లేదని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ అధికారికంగా వెల్లడించారు. మళ్లీ పంపిణీ ఎప్పుడు అనేది త్వరలోనే వెల్లడిస్తాం అని అన్నారు. దాదాపు 30 లక్షల మంది మహిళలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూములను సిద్దం చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ఇళ్లపట్టాల కార్యక్రమం ఇప్పటికి మూడుసార్లు వాయిదా పడింది.
మొదటగా మార్చి 15న ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని అనుకున్నారు. కానీ , అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో అది కుదరలేదు. ఆ తర్వాత ఉగాదికి వాయిదా పడింది. ఇక జూన్ నెలలో ఈ కార్యక్రమం చేపట్టాలని అనుకున్నారు. కానీ రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు కారణంగా అది కాస్తా సాధ్యపడలేదు. ఇప్పుడు ఆగష్టు 15న చేపట్టాలని అనుకుంటే, మరోసారి వాయిదా పడింది. కోర్టు కేసులతో పాటూ కరోనా కేసులు ఉండటంతో వాయిదా వేశారనే చర్చ జరుగుతోంది.