జనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉచ్చులో పడిపోయారు. పొద్దున లేచింది మొదలు.. పడుకునే వరకూ అంతా సోషల్ మీడియాకు ఎక్కిస్తున్నారు. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ ఇప్పుడీ సోషల్ మీడియాలో తమ గురించి అందరూ చూడాలని.. తమ వీడియోలకు ఆదరణ రావాలని పరితపిస్తున్నారు. అరచేతిలో స్మార్ట్ ఫోన్ రావడం.. సోషల్ యాప్స్ బోలెడన్నీ ఉండడంతో ప్రతీ వ్యక్తికి ఇప్పుడు ఇది ఒక వ్యసనంగా మారిపోయింది. కొందరి ప్రాణాలు కూడా తీస్తోంది.
సరదాగా మొదలయ్యే ఈ వ్యాపకం చినికి చినికి గాలివానలా మారి తీవ్ర నష్టాన్ని మిగుల్చుతోంది. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని తహతహలాడుతున్నారు. తాము పెట్టే పోస్టులకు ఎక్కువ లైకులు రావడం కోసం ప్రమాదాలను లెక్క చేయడం లేదు.
తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఓ అత్యుత్సాహ పరుడు యూట్యూబ్ లోని తన వీడియోలకు వ్యూస్ రావడం లేదని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన యూట్యూబ్ ఛానల్ కు వ్యూస్ రావడం లేదంటూ ఓ విద్యార్థి బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రాంతినగర్ కాలనీలో ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. క్రాంతినగర్ లో ఓ అపార్ట్ మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి పేరు డీనా అని పోలీసులు గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనాస్థలాన్ని , మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
కాగా పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. యూట్యూబ్ లో సెల్ఫ్ లో గేమ్ ఛానల్ ను డీనా నిర్వహిస్తున్నట్టు తేలింది. ఆ చానెల్ లో వ్యూస్ పెరగడం లేదని మనస్థాపం చెందాడు. తనకు ఎదుగుదల లేదని మానసిక ఒత్తిడికి గురయ్యాడు. చివరకు తీవ్ర వేదనకు గురై బలవన్మరానికి పాల్పడ్డాడు.
ఇక డీనా మామూలు స్టూడెంట్ ఏం కాదు.. ఏకంగా ఐఐటీ గ్వాలియర్ లో ఇంజినీరంగ్ చదువుతున్నాడు. అంతటి మేధా సంపన్నుడు సైతం ఇలా సోషల్ మీడియా ఉచ్చులో పడి ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది.