ముదిరాజ్ ఈటెల కొడుకు పేరు పక్కన ‘రెడ్డి’ ఎలా?

Update: 2021-05-01 06:30 GMT
సుదీర్ఘ రాజకీయ జీవితం.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించటంతోపాటు.. ప్రత్యేక రాష్ట్రం కోసం తన వ్యాపారంలో సంపాదించిన సొమ్ముల్ని భారీగా పెట్టిన అతి కొద్దిమంది నేతల్లో ఈటెల రాజేందర్ ఒకరు. నిజానికి మంచి వక్తగా.. సీనియర్ రాజకీయ నేతగా..తన నియోజకవర్గంలో తిరుగులేని నేతగా తెలిసిన ఈటెల.. చాలామందికి భారీ ఫౌల్ట్రీ బిజినెస్ నడిపిస్తారన్న విషయం తెలీదు. తెలంగాణలో అతి పెద్ద ఫౌల్ట్రీ వ్యాపారవేత్తగా ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు అన్ని ఇన్ని కావు. అలాంటి ఆయన కులం ఏమిటన్న దానిపై చాలానే చర్చ నడుస్తుంటుంది.

ఆయన మున్నురు కాపు అని కొందరు.. కాదు కాదు రెడ్డి అని మరికొందరు.. బీసీ అని చెప్పుకునే వేళలో ఆయన కులం మీద ఒక్కొక్కరు ఒక్కోలా వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే.. తన కులం గురించి ఎప్పుడు మాట్లాడని ఈటెల.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా అన్ని విషయాలపై ఓపెన్ అయ్యారు. వంద ఎకరాలకు పైగా అసైన్డ్ భూమిని సొంతం చేసుుకున్నారని.. మరికొందరి భూముల్ని కబ్జా చేసినట్లుగాఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వేళ మీడియా ముందుకు వచ్చారు ఈటెల.
కబ్జా పేరుతో తన మీద వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చే క్రమంలో ఆయన కొన్ని ఆసక్తికర అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చారు. తన సామాజిక వర్గం మీద కూడా ఇప్పుడు దాడి మొదలైందని.. తాను బీసీని అయితే.. తన కొడుకు పేరు చివర రెడ్డి ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాడినని.. తనది భయపడే జాతి కాదన్నారు.

ధైర్యంతో ముందుకు పోయే జాతి అని.. చావనైనా చస్తాం తప్పించి లొంగిపోయే జాతి కాదన్నారు. తన భార్య రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారని.. అందుకే తన కొడుక్కి నిఖిల్ పేరు పక్కన రెడ్డి అని ఆమె పెట్టుకున్నదన్నారు. నిఖిల్ పేరు పక్కన రెడ్డి అన్నది తన భార్య యాడ్ చేసిందని.. దాన్ని కూడా ఇష్యూ చేస్తున్నారన్నారు.

సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుకున్న ఈటల ఎట్ల సంపాదించుండు అని అడుగుతున్నారని.. స్కూటర్ మీద వచ్చి.. వెయ్యి రెండు వేలకు ఎకరా చొప్పున కొని వందల కోట్లకు ఎదిగారని.. ఒకటే జనరేషన్ లో రూ.100 కోట్లకు అధిపతులైన వాందరన్నీ భూములు.. ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రశ్నించాలని చెప్పిన తీరు చూస్తే.. తనను బద్నాం చేసినందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని ఈటల చెప్పకనే చెప్పారని చెప్పాలి.




Tags:    

Similar News