పిల్లలు పుట్టడానికి ఎప్పుడు ఎన్నిసార్లు శృంగారం చేయాలి?

Update: 2020-05-02 23:30 GMT
‘శృంగారంలో ఎప్పుడు పాల్గొంటే గర్భం వస్తుంది..?’ కొత్తగా పెళ్ళయిన వారు మొదలుకుని గర్భాదారణ కోసం ఎదురు చూసే ప్రతి వారిని తొలిచే ప్రశ్న ఇదే.. గర్భం వస్తుందేమోనని ఆందోళన చెందేవారు కొందరైతే.... గర్భం కోసం వేయికళ్ళతో ఎదురు చూసే వారు మరికొందరు. అప్పుడే పిల్లలు వద్దనుకునే వారికి ఇది భయం కలిగిస్తుంది. పిల్లులు లేని వారికి ఆతృత పుట్టిస్తుంది. ఇంతమందిలో ఇన్ని రకాల భావనలను కలిగించే ఈ గర్భదారణ కథా కమామిషూ ఏమిటో తెలుసుకుందాం..

తాజాగా చేసిన అధ్యయనం ప్రకారం.. 1194 మంది తల్లిదండ్రుల దగ్గర నుంచి వివరాలు సేకరించారు. వారు నెలలో 13 సార్లు శృంగారంలో పాల్గొన్నారు. గర్భాదరణ మీద ధ్యాసతో ఆ పనిచేస్తే పిల్లలు పుట్టరని ప్రశాంతంగా ఒత్తిడి లేకుండా చేయాలని సూచిస్తున్నారు.

సాధారణంగా గర్భదారణ అనేది మాతృత్వానికి చిహ్నం. స్త్రీ, పురుషుల శారీరక కలయికతో గర్భదారణ జరుగుతుంది. ఇది జగమెరిగిన సత్యం. మరి.. స్త్రీ, పురుషులు కలిసిన వెంటనే గర్భం వచ్చేస్తుందా? అనేది కొందరి ప్రశ్న... గర్భం రావాలంటే ఏం చేయాలి? ఎప్పుడు కలవాలి? ఇది ఇంకొందరి ప్రశ్న...! వీటన్నింటికి ఒక్కటే సమాధానం గర్భదారణ గురించి తెలుసుకోవడమే.

మగవారి నుంచి విడుదలయ్యే వీర్యకణాలు, మహిళలలో వీడుదలయ్యే అండంతో కలసి పిండంగా మారుతాయి. దీనినే గర్భదారణ అని అంటారు. సాధారణంగా రుతుస్రావం జరుగుతున్న మహిళల్లో బహిష్టు అయిన 12 నుంచి 16 రోజుల లోపు అండం విడుదల అవుతుంది. దీనినే భారతీయ ప్రమాణికంగా భావించవచ్చు. ఈ సమయంలో రతిలో పాల్గనడం వలన గర్భదారణ జరుగే అవకాశాలు చాలా ఎక్కువ. అంటే పీరియడ్స్ అవ్వడానికి ఒకరోజు ముందు లేదా రెండురోజుల లోపు శృంగారంలో పాల్గొంటే ఖచ్చితంగా గర్భం వస్తుందని వైద్యులు చెబుతున్నారు. సో పిల్లలు లేని దంపతులు మీరూ ఇలా ట్రై చేసి చూడండి.. తప్పకుండా ఫలితం ఉంటుందంటున్నారు వైద్యులు..

గర్భాదారణ కోసం సాధారణంగా జంటలు 78 సార్లు శృంగారంలో పాల్గొంటాయని తేల్చారు. అది ఎన్ని రోజుల్లో అనేది మాత్రం వారి వారి ఇష్టాఇష్టాలను బట్టి ఉంటుందని తెలిపారు. ఇక రోజులో ఒకసారి కంటే ఎక్కువగా శృంగారం లో పాల్గొనకూడదు.. ఎక్కువ సార్లు పాల్గొంటే వీర్యం పలుచన అయ్యి ఆరోగ్యమైన శుక్రకణాల శాతం తగ్గుతుంది. ఒకటి రెండు రోజులకు ఒకసారి శృంగారంలో పాల్గొనాలి.
Tags:    

Similar News