తాజా ఎన్నిక‌ల్లోక‌మ‌ల్ పార్టీకి వ‌చ్చిన ఓట్లు ఎన్ని?

Update: 2019-05-25 11:14 GMT
విశ్వ క‌థానాయుడ‌న్న బిరుదుతో పిలుచుకునే సీనియ‌ర్ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ స్థాపించిన మ‌క్క‌ల్ నీది మ‌య్యం పార్టీ తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘోరంగా ఫెయిల్ అయ్యింది. త‌మిళ‌నాడులో చ‌క్రం తిప్పాల‌ని త‌పిస్తున్న క‌మ‌ల్ హాస‌న్ 14 నెల‌ల క్రితం పార్టీని ఏర్పాటు చేశారు. ద‌క్షిణాదిన ఉన్న ఆరు రాష్ట్రాల‌కు సింబాలిక్ గా త‌న పార్టీ లోగోలో ఆరు చేతుల్ని పెట్టిన ఆయ‌న‌.. తాజా ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తామ‌న్న ఆశ‌లేం పెట్టుకోలేదు. దీనికి త‌గ్గ‌ట్లే క‌మ‌ల్ పార్టీకి భారీగా ఓట్లు రాలేదు. త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో త‌న ప్ర‌భావాన్ని చూపించాల‌నుకున్నా.. ఆయ‌న అలాంటిదేమీ
చూపించ‌లేక‌పోయార‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. అయితే.. దీనిపై క‌మ‌ల్ వాద‌న మ‌రోలా ఉంది. ఎన్నిక‌ల వేళ‌లో.. త‌మ పార్టీకి 5 శాతం ఓట్లు వ‌చ్చినా.. తాము ఆట‌లో ఉన్న‌ట్లుగా వ్యాఖ్యానించార‌ని.. తాజాగా ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో త‌మ‌కొచ్చిన ఓట్ల శాతం సంతృప్తిక‌రంగా ఉంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. క‌మ‌ల్ పార్టీకి వ‌చ్చిన ఓట్ల షేర్ చూస్తే.. గ్రామీణ ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోక‌లిపి  3.72 శాతంగా చెప్పాలి.  రాజ‌కీయ విశ్లేష‌కులు చెప్పిన 5 శాతం ఓట్ల షేర్ కు దాదాపుగా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చామ‌న్న వాద‌న‌ను క‌మ‌ల్ హాస‌న్ వ్య‌క్తం చేశారు. తాజాగా చెన్నైలోనిపార్టీ కార్యాల‌యంలో మాట్లాడిన ఆయ‌న‌.. పార్టీని ప్రారంభించిన స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే ఈ స్థాయిలోకి తీసుకెళ్ల‌టం త‌న‌కు బ‌లాన్ని ఇచ్చిన‌ట్లుగా పేర్కొన్నారు. త‌మ పార్టీకి ఓటు వేసిన ప్ర‌జ‌ల‌కు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు.

తాజా ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ ఫెయిల్ అయ్యింద‌న్న వాద‌న‌ను తాను అంగీక‌రించ‌న్నారు. ఫ‌లితాల‌పై క‌మ‌ల్ నిరాశ చెందిన‌ట్లుగా క‌నిపించ‌కుండా క‌వ‌ర్ చేస్తున్నార‌ని.. ఆయ‌న పార్టీలో ప్ర‌జ‌లు త‌మ‌కు వేసిన ఓట్ల మీద తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలిస్తే ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో కొంత‌మేర ఓటింగ్ ఫ‌ర్లేద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే.. అంతో ఇంతో త‌మ పార్టీ ప్ర‌భావం చూపిస్తుంద‌ని భావిస్తే.. ఎన్నిక‌ల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోక‌పోవ‌టంపై పార్టీ నేత‌లు ప‌లువురు తీవ్ర సంతృప్తితో ఉన్నారు. ఇదిలా ఉంటే.. త‌న లక్ష్యం మొత్తం 2021లో త‌మిళ‌నాడు అసెంబ్లీకి జ‌రిగే ఎన్నిక‌లుగా క‌మ‌ల్ చెబుతున్నారు. ఇప్ప‌టికైతే ఏమీ లేదు కానీ.. రానున్న రోజుల్లో ఎంత‌మేర ప్ర‌భావాన్ని చూపిస్తారో చూడాలి.
Tags:    

Similar News