2 నెలల 2 రోజులు.. ఐపీఎల్ -18 షెడ్యూల్ వచ్చేసిందోచ్
ఇప్పుడు ఒక్కదాని గురించే మాట్లాడుకుందాం.. అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). మెగా లీగ్ సమరం షురూ ఎప్పుడో తెలిసిపోయింది.
న్యూజిలాండ్ తో స్వదేశంలో క్లీన్ స్వీప్ తాలూకు ఘోర పరాజయం గురించి మర్చిపోండి..
ఆస్ట్రేలియాలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ లో టీమ్ ఇండియా చేతులెత్తేసిన వైనాన్ని దిగమింగుకుందాం..
ఈ నెల నుంచి మొదలయ్యే ఇంగ్లండ్ సిరీస్, ఫిబ్రవరిలో జరిగే చాంపియన్స్ ట్రోఫీ గురించి పక్కన పెడదాం..
ఇప్పుడు ఒక్కదాని గురించే మాట్లాడుకుందాం.. అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). మెగా లీగ్ సమరం షురూ ఎప్పుడో తెలిసిపోయింది.
ఐపీఎల్ 18వ సీజన్ లో ఎన్నో విశేషాలు.. నిబంధనల్లో అనేక మార్పులు.. అందుకే వచ్చే సీజన్ అత్యంత జనరంజకంగా జరగడం ఖాయం అని భావిస్తున్నారు.
కాగా, 2025లో ఐపీఎల్ జరిగేది ఎప్పుడో తెలిసిపోయింది. మెగా లీగ్ మార్చి 23 నుంచి మొదలై మే 25 వరకు జరగనుంది. ఎప్పటిలాగానే పది జట్లు ఈసారీ టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఈ సీజన్ కు సంబంధించి నవంబరులోనే మెగా వేలం పూర్తయిన సంగతి తెలిసిందే. ఇందులో ఎప్పుడూ లేనంతగా టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ ను రూ.27 కోట్లకు పాడుకుంది లక్నో సూపర్ జెయింట్స్. ఆ తర్వాత రూ.26.75 కోట్లకు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ను దక్కించుకుంది పంజాబ్ కింగ్స్.
కాగా, గత ఏడాది ఐపీఎల్ మార్చి 22న ప్రారంభమై మే 26 వరకు జరిగింది. ఈసారి దానికంటే ఒక్క రోజు తర్వాత మొదలై ఒక్క రోజు అదనంగా సాగనుంది.