మోడీని చంద్రబాబు ఎంత అడుగుతారు?

Update: 2015-08-19 04:39 GMT
రాష్ట్ర విభజనలో అత్యంత కీలకమైన ప్రత్యేకహోదా అంశాన్ని మోడీ నేతృత్వంలోని ఏన్డీయే సర్కారు పక్కన పెట్టేయటం తెలిసిందే. అయితే.. ఏపీలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా.. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు.. ఆర్థిక దన్ను కోసం కేంద్రాన్ని సాయం కోరాలని.. గతంలోని ఇచ్చిన హామీల్ని అమలుచేయాలని ఏపీ ముఖ్యమంత్ర చంద్రబాబు కోరనున్నట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఇందులో భాగంగా ప్రధానమంత్రి మోడీని.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కలవనున్నారు. ఆయన దృష్టికి తమ డిమాండ్లను తీసుకురానున్నారు. మోడీ వద్దకు వెళుతున్న బాబు.. ఏపీకి ఎంతమేర సాయం కోరనున్నారు? ఇందుకు తగినట్లుగా ఆయన నివేదికలు సిద్ధం చేశారంటే అవుననే చెప్పాలి.

ప్రత్యేక హోదా కింద ఏపీకి రూ.25వేల కోట్లు.. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.1.25లక్షల కోట్ల సాయాన్ని కేంద్రం నుంచి అడగాలని చంద్రబాబు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లు నివేదికలు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.  ఇంత భారీ మొత్తాన్ని కేంద్రం ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ.. విభజన సందర్భంగా నాటి ప్రధానమంత్రి రాజ్యసభలో ఇచ్చిన హామీ.. ప్రస్తుత ఏపీ ఆర్థిక పరిస్థితిని వివరించాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

గురువారం ప్రధాని మోడీతో భేటీ కానున్న చంద్రబాబు.. తమ డిమాండ్ల చిట్టాను విప్పనున్న విషయం తెలిసిందే. అయితే.. అంచనాల్లోనే.. బాబు చిట్టా మొత్తం విలువ రూ.1.5కోట్లకు మాత్రమే ఉండటం గమనార్హం. ఇంతా చేస్తే.. రాజధాని ఏర్పాటు.. అందుకయ్యే ఖర్చులో కేంద్రం భరించే వాటా ఎంతన్న విషయంపై ఇప్పటి వరకూ ఒక్క మాట చెప్పింది లేదు. ఏమీ కోరకుండానే.. బీహార్ కు రూ.1.65లక్షల కోట్లు ప్యాకేజీ కింద ప్రకటిస్తే.. విభజనతో దారుణమైన నష్టానికి గురైన ఏపీకి బాబు తయారు చేసిన సాయం మొత్తం విలువ బీహార్ కు ప్రకటించిన ప్యాకేజీ కంటే తక్కువగా (రూ.1.5లక్షల కోట్లు) ఉండటం గమనార్హం.
Tags:    

Similar News