సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న వాళ్లు కొన్ని పెయిడ్ మెసేజులు పెట్టడం ద్వారా డబ్బులు సంపాదిస్తారన్న సంగతి తెలిసిందే. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. ఇలా తాను భారీగా ఆదాయం సంపాదిస్తున్నట్లు స్వయంగా వెల్లడించాడు. ట్విట్టర్లో, ఫేస్ బుక్ లో.. ఇన్ స్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారన్న దాన్ని బట్టి వాళ్లు పెట్టే పెయిడ్ మెసేజుల రేటు ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఆ సెలబ్రెటీల రీచ్ ఏ వర్గంలో ఎక్కువ ఉందన్నది కూడా కీలకమే. ఈ విషయంలో ఇండియాలో అత్యధిక విలువ ఉన్న సెలబ్రెటీల్లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఒకడు.
కోహ్లికి ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 1 కోటి 60 లక్షల మంది ఫాలోవర్లున్నారు. వాళ్లలో అందరూ దాదాపుగా యూతే. అందుకే అతను ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫొటో షేర్ చేస్తే ఏకంగా రూ.3.5 కోట్లు పారితోషకంగా ఇస్తాయట వాణిజ్య సంస్థలు. దీన్ని బట్టి విరాట్ బ్రాండ్ వాల్యూ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే అతను బ్రాండ్ వాల్యూ పరంగా అర్జెంటీనా సాకర్ సూపర్ స్టార్ లయోనెల్ మెస్సిని కూడా దాటేశాడు. ప్రపంచ క్రికెటర్లలో విరాట్ కంటే విలువ ఉన్న ఆటగాడు మరొకరు లేదు ప్రస్తుతం. కోహ్లి కొన్ని సెకన్ల పాటు కనిపించే ఒక వాణిజ్య ప్రకటన కోసం కొన్ని కోట్లు పుచ్చుకుంటాడు. ఏటా అతను అన్ని రకాలుగా కలిపి వందల కోట్లల్లో ఆదాయం ఆర్జిస్తున్నాడు.