ఇవాల్టి నుంచి లైఫ్ లో వచ్చే మార్పులతో ముప్పు తీవ్రత ఎంతంటే?

Update: 2020-06-08 04:45 GMT
యావత్ ప్రపంచం మహమ్మారికి ముందు తర్వాత అన్న విభజన ఎంత స్పష్టంగా ఉంటుందో.. కేంద్రం ప్రకటించిన అన్ లాక్ 1.0 పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. గడిచిన రెండున్నర నెలల కాలంలో మూతపడిన గుళ్లు.. హోటళ్లు.. రెస్టారెంట్లు.. మాల్స్ ఈ రోజు నుంచి తెరుచుకోనున్నాయి. లాక్ డౌన్ ముందు ఉన్న పరిస్థితులు పూర్తిగా రానప్పటికీ.. ఈ రోజుతో 80 శాతానికి పైగా అన్ని తెరుచుకున్నట్లే.

దీంతో సౌకర్యాల సంగతి ఎలా ఉన్నా.. కొత్త ముప్పు తెర పైకి రానుంది. ఎక్కడి దాకానో ఎందుకు? రెండు తెలుగు రాష్ట్రాల సంగతే తీసుకుందాం. ఈ రోజు నుంచి కావాల్సిన హోటల్ కు.. రెస్టారెంట్ కు వెళ్లొచ్చు. కోరుకున్నది తినొచ్చు. ఉండొచ్చు. లాక్ డౌన్ నేపథ్యంలో మారిన జీవన శైలికి భిన్నంగా పాత అలవాట్లు.. ఆహార పదార్థాలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో.. రోటీన్ జీవితంలో కొత్త ముప్పు పొంచి ఉందని చెప్పాలి.

లాక్ డౌన్ వేళలో.. తరచూ ఎదరయ్యే ఫుడ్ కంటామినేషన్ కేసులు కనిష్ఠ స్థాయికి తగ్గిపోయిన వైనాన్ని మర్చిపోకూడదు. చాలా ఎక్కువగా కుటుంబంతో క్వాలిటీ టైం గడిపే అవకాశం లభించింది. అది ఇవాల్టి నుంచి తగ్గే వీలుంది. మునుపటి బిజీ జీవితం కాకున్నా.. కొంతమేర ఎంగేజ్ అయ్యే ఛాన్సు ఉంది. గుళ్లకు వెళ్లే అవకాశం ఉన్నా.. అక్కడికి వచ్చే భక్తుల్లో ఒకరిద్దరి నిర్లక్ష్యం అందరిక కొంప మునిగేలా చేస్తోంది.

ఇక.. హోటళ్లు.. రెస్టారెంట్లు.. మాల్స్ ఓపెన్ కానున్న నేపథ్యంలో ఖర్చుకు ఖర్చుతో పాటు.. విరివిగా అందుబాటులోకి వచ్చే ఆహారంతో ఇప్పటి వరకూ సాగిన ఆహార అలవాట్ల కారణంగా ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇవాల్టి నుంచి జీవితాల్లో వచ్చేకొత్త మార్పుల నేపథ్యంలో అప్రమత్తత చాలా అవసరం. ఈ విషయంలో జరిగే చిన్న తప్పులకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. టేక్ కేర్. ఆల్ ద బెస్ట్.
Tags:    

Similar News