అక్కసు వెళ్లగక్కిన పాక్ మీడియా

Update: 2019-08-06 10:32 GMT
కశ్మీర్ ను విభజించి, ఆర్టికల్ 370 రద్దుతో భారత్ లో సంబరాలు జరుగుతుండగా.. శత్రుదేశం పాకిస్తాన్ లో మాత్రం దీనిపై విషం కక్కుతున్నారు. అక్కడి నేతలు, మీడియా దీన్ని ఖండిస్తున్నారు. భారత్ మీడియాలో కశ్మీర్ సమస్యకు గొప్ప పరిష్కారం అంటూ కథనాలు వస్తుండగా.. పాకిస్తాన్ మీడియా మాత్రం దీనిపై విషం కక్కింది.

పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ డాన్ తోపాటు జాతీయ పత్రికలన్నీ భారత్ ఆడలేక మద్దెలు ఓడు అన్న చందంగా కశ్మీర్ ను విభజించిందని రాసుకొచ్చాయి. కశ్మీర్ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందాయని ఆ దేశ మీడియా విషం కక్కింది.

భారత్ కశ్మీర్ ను విభజించి దాని స్వయం ప్రతిపత్తిని తీసేసి ఆ ప్రజలను మోసం చేసిందని డాన్ పత్రిక దుష్ప్రచారం చేసింది. పాకిస్తాన్ టుడే పత్రిక భారత్ కశ్మీరీలను మోసం చేసిందని రాసుకొచ్చింది. కశ్మీర్ చరిత్రలో చీకటి రోజు అని ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక దుయ్యబట్టింది.

ఇలా పాకిస్తాన్ మీడియా భారత్ గొప్ప సంస్కరణపై తన అక్కసును వెళ్లగక్కింది. భారత్ కొట్టిన దెబ్బతో అక్కడి నేతలకే కాదు.. మీడియాలో ఒకరకమైన ఫస్ట్రేషన్ ఆవహించి కథనాలు అలా వండివర్చాయి.
Tags:    

Similar News