అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక హెచ్-1బి వీసాల అంశంపై తీవ్రమైన చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. హెచ్-1బి వీసాలు కల్గివున్న వారిలో భారతీయులు అధికమని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) అధికారిక నివేదిక వెల్లడించింది. గత 11 ఏళ్లలో సుమారు 21 లక్షలకు పైగా భారత్‌కు చెందిన ఐటీ ఉద్యోగులు హెచ్-1బి వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు యూఎస్‌సీఐఎస్ తెలిపింది. అయితే దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ మందికి అర్హతలు లేకపోవడంతో వాటిని తిరస్కరించిందని నివేదిక స్పష్టంచేసింది.
2007 నుంచి 2017 జూన్ వరకు హెచ్-1బి వీసాల కోసం 34 లక్షల దరఖాస్తులు రాగా, వాటిలో సుమారు 21లక్షల దరఖాస్తులు భారత్ నుంచే వచ్చాయని యూఎస్‌సీఐఎస్ పేర్కొంది. ప్రతి ఏడాది 70 నుంచి 80శాతం విదేశీ ఉద్యోగులను భారత్ నుంచే అమెరికా తీసుకుంటున్నట్టు యూఎస్‌సీఐఎస్ తెలిపింది. మిగిలిన 20 శాతం ఉద్యోగులను చైనా, ఫిలిప్పీన్స్ , దక్షిణ కొరియా, కెనడాల నుంచి తీసుకుంటున్నట్లు చెప్పింది. ఈ 11 ఏళ్ల కాలంలోనే అమెరికా 26లక్షల మందికి హెచ్1బి వీసాలను జారీ చేసినట్టు యూఎస్‌సీఐఎస్ తన నివేదికలో వెల్లడించింది. 2007లో హెచ్-1బి వీసాలు ఉన్న ఉద్యోగులకు సగటును 68,159 డాలర్ల వేతనం చెల్లించేవారని, 2017లో 92,317 డాలర్లు చెల్లిస్తున్నారని తెలిపింది.
ఈ 11 ఏళ్లలో అమెరికా జారీచేసిన హెచ్-1బి వీసా లబ్ధిదారుల్లో 25 నుంచి 34 ఏళ్లలోపు వారే అధికం. అలాగే ఈ 11 ఏళ్లలో 2వేల మందికి పైగా ఈ హెచ్-1బి వీసాలను 65ఏళ్లు దాటిన వారికి మంజూరయ్యాయని తెలిపింది. సుమారు 20 లక్షల వీసాలు కంప్యూటర్ సంబంధమైన వృత్తుల్లో వివిధ కేటగిరీల వారికే జారీచేసినట్టు యూఎస్‌సీఐఎస్ తెలిపింది. కస్టమ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సర్వీసెస్ కు 9,99,901, కంప్యూటర్ డిజైన్ సర్వీసెస్ కు2,87,000, కాలేజీ యూనివర్శిటీలు, ప్రొఫెషనల్ స్కూళ్లకు 22,900 వీసాలు జారీ చేసినట్లు చెప్పింది. కంప్యూటర్ రంగం తర్వాత ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, సర్వేయింగ్ కు 3,18,670, ఎడ్యుకేషన్ కు 2,44,000, అడ్మినిస్ట్రేటివ్ స్పెషలైజేషన్స్ కు 2,45,000, మెడిసిన్&హెల్త్ కు 1,85,000 వీసాలు మంజూరు చేశామని యూఎస్‌సీఐఎస్ పేర్కొంది.