# ఫేస్ బుక్ డిలీట్...ఇలా చేస్తే స‌రి!

Update: 2018-03-22 10:06 GMT
ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఐదు కోట్ల మంది ఫేస్ బుక్ ఖాతాదారుల వ్య‌క్తిగ‌త స‌మాచారం లీక్ అవ‌డం సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. కొంత‌కాలంగా ఫేస్ బుక్ లో వ్య‌క్తిగ‌త స‌మాచారం ...చౌర్యానికి గుర‌వుతుందంటూ వ‌స్తున్న ఊహాగానాల‌కు ఊత‌మిచ్చేలా డేటా బ్రీచ్ కావ‌డం క‌ల‌కలం రేపింది.  

కోగన్.. కేంబ్రిడ్జ్.. ఎనలిటికా సంస్థలు....డేటాను దుర్వినియోగం చేశాయ‌న్న ఆరోప‌ణ‌ల‌ను ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కూడా ధృవీక‌రించారు. డేటా బ్రీచ్ కాకుండా తాము చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ ఇలా జ‌ర‌గ‌డం బాధాక‌ర‌మ‌ని, భ‌విష్య‌త్తులో ఇటువంటివి జ‌ర‌గ‌కుండా చూసుకుంటామ‌ని జుక‌ర్ తెలిపారు. దీంతో, త‌మ ఖాతాల‌లోని స‌మాచారం పై ఫేస్ బుక్ వినియోగ‌దారులు ఆందోళ‌న చెందుతున్నారు. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా తమ ఫేస్ బుక్‌ ఖాతాలను డిలీట్ చేయాల‌నే యోచ‌న‌లో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఇంట‌ర్నెట్ లో `#డిలీట్ ఫేస్ బుక్‌` ట్రెండింగ్ లో ఉంది.

త‌మ ఫేస్ బుక్ ఖాతాను తొలగించుకోవాల‌ని చాలామంది ఇంట‌ర్నెట్ లో  సెర్చ్ చేస్తున్నారు. వాస్త‌వానికి - ఫేస్ బుక్ ఖాతాను తొల‌గించేందుకు డీ-యాక్టివేషన్ - డిలీషన్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. డీ-యాక్టివేషన్ ద్వారా ఫేస్‌ బుక్ ఖాతాను తాత్కాలికంగా కనిపించకుండా చేయ‌వ‌చ్చు. ఆ ఆప్ష‌న్ ను ఎంచుకున్న త‌ర్వాత కొద్ది రోజులకు తిరిగి యాక్టివేట్ చేసుకోవ‌చ్చు. ఆ గ్యాప్ లో మ‌న ఖాతా ఎవ‌రికీ క‌నిపించ‌దు.యూజ‌ర్ ఐడీ  - పాస్ వర్డ్ ద్వారా లాగిన్ అయి ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేసుకోవ‌చ్చు. 'డిలీషన్` ఆప్షన్ ఎంచుకుంటే ఖాతాలోని సమాచారం, ఫోటోలు - పోస్టులు - ఇతరత్రా అన్నీ 90 రోజుల్లో డిలీట్ అవుతాయి. ఆ సమయంలోనూ ఇతరులకు మ‌న‌ ఫేస్‌ బుక్ ఖాతా కనిపించదు. అయితే, ఫేస్ బుక్ ఖాతాను డిలీట్ చేసేముందు అందులోని డేటాను భ‌ద్ర‌ప‌రిచే అవ‌కాశం ఉంది.

ఫేస్‌ బుక్ ఖాతాలో కుడివైపున టాప్ ఆప్షన్ క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్లిన త‌ర్వాత జనరల్ సెట్టింగ్స్ లో 'డౌన్‌ లోడ్ ఏ కాపీ ఆఫ్ ఫేస్‌ బుక్ డేటా' అనే ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చేస్తే ఫేస్‌ బుక్ డేటా మొత్తం రిజిష్ట‌ర్డ్ మెయిల్ కు ఫార్వార్డ్ అవుతుంది. మ‌న మెయిల్ కు డేటా వ‌చ్చిన‌ త‌ర్వాత ఫేస్‌ బుక్ ఖాతాలో సెట్టింగ్స్ లో ఎడిట్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ త‌ర్వాత 'మేనేజ్ ఎకౌంట్' ఆప్షన్ లో 'రిక్వెస్ట్ ఎకౌంట్ డిలీషన్`ను క్లిక్ చేస్తే ఆ ఖాతా ప‌ర్మినెంట్ గా డిలీట్ అవుతుంది. డిలీట్ ఆప్షన్ ఎంచుకున్న త‌ర్వాత కూడా ఖాతాను తిరిగి పొందే అవ‌కాశం ఉంది. 90రోజుల లోపు...అంటే  ఖాతా నుంచి పూర్తి సమాచారాన్ని తొలగించేలోగా డిలీషన్ ప్రాసెస్ ను క్యాన్సిల్ చేసి ఖాతాను పున‌రుద్ధ‌రించే అవ‌కాశం ఉంది.


Tags:    

Similar News