ఎలా పంచాలి రేషన్.. టీకాలివ్వాలంటున్నడ్రైవర్లు

Update: 2021-05-06 12:32 GMT
అందరినీ కరోనా భయం ఆవహించింది. ఇప్పుడు బయట పనులు చేసే వారు.. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాలను పంపిణీ చేసేవారికి ఈ మహమ్మారి భయం పట్టుకుంది. బయటకు వెళితే చాలు అంటుకునే ఈ అంటువ్యాధి ఇప్పుడు అందరినీ గుబులు పుట్టిస్తోంది.
 
తాజాగా రాజమండ్రిలో ఇంటింటికి వాహనాల ద్వారా రేషన్ సరఫరా చేసే వాహనాల డ్రైవర్లు ఆందోళనబాట పట్టారు. కరోనా సెకండ్ వేవ్ వల్ల బయట తిరగడమే ప్రమాదమని.. ఇంటింటికి వెళితే తాము కరోనా బారిన పడుతామని వారంతా వాహనాలను పార్క్ చేసి ఆందోళన బాట పట్టారు. రాజమండ్రి ఆనం కళా కేంద్రం ఆవరణలో రేషన్ డోర్ డెలివరి చేసే వ్యాన్ డ్రైవర్స్ (ఎండీయూ) వారికి వ్యాక్సిన్, పీపీఈ కిట్స్, చేతికి గ్లౌజులు, ఫేస్ షీల్డ్ ప్రభుత్వం అందజేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు.

తమకు టీకాలు వేశాకే తాము ఇంటింటికి రేషన్ సరఫరా చేస్తామంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఈ దృశ్యాలను టీడీపీ యువ నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆయన బంధువు ఎర్రంన్నాయుడు, ప్రస్తుత రాజమండ్రి ఎమ్మెల్యే భర్త అయిన ఆదిరెడ్డి అప్పారావు కొడుకు షేర్ చేయడం విశేషం.

ఏపీ ప్రభుత్వం తమ మొర ఆలకించాలని.. వెంటనే తగిన రక్షణ చర్యలు చేపట్టాలని వాహనాల డ్రైవర్లు కోరుతున్నారు. వారికి మద్దతుగా వైసీపీ నేతలు సైతం అండగా నిలబడడం విశేషంగా మారింది.

https://fb.watch/5jA229w5Jo/





Tags:    

Similar News