అస‌లు నోటు ప‌సిగట్టాలంటే ఇలా చేయాల్సిందే

Update: 2016-11-18 14:00 GMT
పాత క‌రెన్సీ మార్చుకోవ‌డం గురించి ఎన్ని వార్త‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయో కొత్త‌గా చెలామ‌ణిలోకి వ‌స్తున్న రూ. 2000 నోటు గురించి సైతం అదే రీతిలో ప‌లు అంశాలు విశ్లేషిస్తున్నారు. కొత్త‌గా విడుద‌ల‌యిన రూ.2000 నోటును అస‌లుద‌ని తెలుసుకునేందుకు ఏం చేయాలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ‌శాఖ అధికారికంగా వివ‌ర‌ణ ఇచ్చింది. ట్వీట్ ద్వారా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన క్లారిటీ ప్ర‌కారం షాక్ ఇస్తేనే కొత్త రూ.2000 అస‌లైన‌ది అన్న‌మాట‌!

న‌కిలీల‌కు చెక్ పెట్టే క్ర‌మంలో ''ఇంటాగ్లియో'' అనే ఫీచర్‌ ను ద్వారా రూ. 2000 నోటును రూపొందించారు. ఈ విధానంలో భాగంగా కాగితంలోకి ఒక రకమైన డిజైన్‌ ను చొప్పిస్తారు. ఓ వస్త్రాన్ని కొత్త రూ. 2000 నోటుపై రుద్దితే టర్బో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ద్వారా చిన్నపాటి షాక్ లాంటిది తగులుతుంద‌ట‌. అలా త‌గిలితేనే అది అసలైన నోటు అని, తగలకపోతే అది నకిలీనోటు అని గుర్తించవచ్చని ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. ఈ వివ‌ర‌ణ‌తో ఇన్నాళ్లు కొత్త రూ.2000 నోటులో ఎలాంటి టెక్నాజల‌జీ లేద‌నే వార్త‌ల‌కు చెక్ పెట్టిన‌ట్ల‌యింది.

ఇదిలాఉండ‌గా లాక‌ర్ల‌లో దాసుకున్న బంగారంపై ఐటీ శాఖ దాడులు జరప‌నున్నాయ‌ని, 600 గ్రాములకు మించి ఉంటే దాన్ని స్వాధీనం చేసుకుంటార‌నే వార్త‌లో ఏమాత్రం నిజం లేద‌ని మ‌రో ట్వీట్‌ లో స్ప‌ష్టం చేసింది. వాట్సాప్‌ - ఇత‌ర సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం అంతా దురుద్దేశ‌పూరిత‌మ‌ని తేల్చి చెప్పింది. ఆర్థిక శాఖ వ‌ద్ద ఇలాంటి ప్ర‌తిపాద‌న ఏదీ లేద‌ని క్లారిటీ ఇచ్చింది. కాగా లాక‌ర్ల‌పై దాడి అనే ఈ ప్ర‌చారాన్ని దొంగ‌లే సృష్టించి ఉంటార‌ని భావిస్తున్నారు. ఈ ప్ర‌చారంతో పెద్ద ఎత్తున బంగారం ఉన్న‌వారు స‌దరు స్వ‌ర్ణాభ‌ర‌ణాల‌ను ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే త‌స్క‌రించుకునేందుకు తేలిక అవుతుంద‌నే ఉద్దేశంతో ఈ ర‌కంగా చేసి ఉంటార‌ని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News