స్వర్గానికి ప్రతీక ఆ సౌధం ఎవరికి సొంతం కానుందో?

Update: 2019-10-28 05:00 GMT
కొన్ని అరుదైనవి ఉంటాయి. ఎన్ని డబ్బులున్నా.. అలాంటి వాటిని తయారు చేయటం కష్టం కాకున్నా.. వాటికున్న పేరుప్రఖ్యాతుల్ని తీసుకురావటం అసాధ్యం. తాజాగా అలాంటిదే ఒకటి అమ్మకానికి వచ్చింది. అమెరికాలో అత్యంత ఖరీదైన నివాసంగా చెప్పే భవనం ఒకటి అమ్మకానికి వచ్చింది.

స్వర్గానికి ప్రతీకగా చెబుతూ.. అక్కడుండే వసతుల గురించి కథలు కథలుగా చెప్పేస్తుంటారు. అలాంటి భవనం ఇప్పుడు అమ్మకానికి పెట్టారు. 1930లో నిర్మించిన ఈ భవింతిని ఆర్కిటెక్ట్ లు హెచ్ ఆకారంలో రూపొందించారు. స్వర్గతుల్యమైన వసతులతో ఉండే ఈ భవన విస్తీర్ణం 40వేల చదరపు అడుగులుగా చెబుతారు.

అరవై గదులతో పాటు స్విమ్మింగ్ ఫూల్.. టెన్నిస్ కోర్టు.. బాస్కెట్ బాల్ కోర్టుతో పాటు రంగురంగుల చేపల కొలనులు.. గులాబీ తోటలతో పాటుఉద్యానవనాలు.. గెస్ట్ హౌస్.. సినిమా థియేటర్ లాంటి వసతులు ఎన్నో ఉన్న ఈ భవంతి ఇప్పుడు ఎవరి సొంతం కానుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ దీని విలువ ఎంతంటారా? మన రూపాయిల్లో జస్ట్ 1846.22 కోట్లు మాత్రమే అంటున్నారు. మరి.. దీన్ని సొంతం చేసుకునే పెద్ద మనిషి ఎవరో చూడాలి.


Tags:    

Similar News