గుంటూరు జిల్లాలో జ‌గ‌న్ స‌భ‌ల‌కు జ‌న‌సంద్రం

Update: 2018-04-19 06:59 GMT
ప్ర‌జాస‌మ‌స్య‌ల్ని గుర్తించ‌టం.. వాటికి ప‌రిష్కారం వెత‌క‌టంతో పాటు.. ప్ర‌జ‌ల్ని చైత‌న్య‌ప‌రిచే ల‌క్ష్యంతో గ‌డిచిన ఆర్నెల్లుగా ఏపీ విప‌క్ష నేత చేస్తున్న పాద‌యాత్ర తాజాగా 1800 కిలోమీట‌ర్లు పూర్తి చేసుకోవ‌టం తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు జిల్లాల్లో ఆయ‌న పాద‌యాత్ర ముగిసిన‌ప్ప‌టికీ మ‌రే జిల్లాలో లేనంత భారీ స్పంద‌న గుంటూరు జిల్లాలో రావ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

మిగిలిన జిల్లాల‌తో పోలిస్తే.. గుంటూరు జిల్లాలో జ‌గ‌న్ స‌భ‌ల‌కు ఊహించిన దాని కంటే ఎక్కువ‌గా జ‌నం రావ‌టం..ఆ జ‌న ప్ర‌వాహం అధికార‌పార్టీలో ఇప్పుడు కొత్త చ‌ర్చ‌కు తెర తీశాయి. జ‌గ‌న్ పాద‌యాత్ర స‌భ‌ల‌కు జ‌నం అంత‌లా ఎందుకు వ‌చ్చార‌న్న‌ది అధికార‌ప‌క్షంలో హాట్ టాపిక్ గా మారింది.

స‌భ‌ల‌కు భారీగా జ‌నం రావ‌టం ఒక ఎత్తు అయితే.. ఇందులో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. జ‌గ‌న్ స‌భ పూర్తి అయ్యే చివ‌రి నిమిషం వ‌ర‌కూ ఆయ‌న చెప్పే మాట‌ల్ని జాగ్ర‌త్త‌గా విన‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఎందుకిలా జ‌రిగింది?  జ‌గ‌న్ స్పీచ్ లో ఏ అంశాలు గుంటూరు జిల్లా ప్ర‌జ‌ల్ని అమితంగా ఆక‌ర్షించాయి?  దీనికి కార‌ణం ఏమిట‌న్న అంశంలోకి లోతుగా వెళితే ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

గుంటూరు జిల్లా మొత్తంగా వేదిక ఏదైనా జ‌నం విర‌గ‌బ‌డిన‌ట్లుగా త‌ర‌లిరావ‌టం వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో మ‌రింత ఉత్సాహాన్ని పెంచ‌ట‌మే కాదు.. కొత్త ఊపు వ‌చ్చేలా చేసింద‌ని చెప్పాలి. స‌భ‌ల‌కు ఇంత భారీగా రావ‌టం వెనుక అధికార‌ప‌క్షం చెబుతున్న‌ట్లుగా భారీగా ప్ర‌జ‌ల్ని త‌ర‌లించిన‌ట్లు ఆరోపిస్తున్నా.. అందులో నిజం లేద‌ని చెబుతున్నారు. ఒక‌వేళ జ‌గ‌న్ స‌భ‌ల‌కు వ‌చ్చిన జ‌నం క‌నుక త‌ర‌లించిన వారైతే.. జ‌గ‌న్ స్పీచ్ ముగిసే వ‌ర‌కూ ఉండ‌ర‌ని.. మ‌ధ్య‌లో స‌ర‌దుకోవ‌టం కామ‌న్ అని.. కానీ అందుకు భిన్నంగా చివ‌రి మాట వ‌ర‌కూ జాగ్ర‌త్త‌గా విని.. పాజిటివ్ గా స్పందిస్తున్న వైనం చూస్తే త‌ర‌లించిన జ‌నం మాట త‌ప్పుగా చెబుతున్నారు.

గుంటూరు జిల్లాలోని అధికార‌ప‌క్ష నేత‌ల్లో నెల‌కొన్న అంత‌ర్గ‌త క‌ల‌హాల‌తో పాటు.. గ‌డిచిన నాలుగేళ్ల‌లో అభివృద్ధి ప‌నుల విష‌యంలో వారు ప్ర‌ద‌ర్శించిన నిర్ల‌క్ష్య‌మే జ‌గ‌న్ మీద ఇంత పెద్ద ఎత్తున అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించ‌టానికి కార‌ణంగా చెబుతున్నారు. దీనికి తోడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లానింగ్ కూడా వ్యూహాత్మ‌కంగా ఉన్న‌ట్లు చెబుతున్నారు. పాద‌యాత్ర సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌ల‌న్నీ కూడా ఆయా ప్రాంతాల్లో మ‌హా ర‌ద్దీగా ఉన్న ప్రాంతాల్లో వేదిక‌లు సిద్ధం చేయ‌టం.. సాయంత్రం వేళ‌లో స‌భ‌లు ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టం కూడా ఈ భారీ స‌క్సెస్ కు కార‌ణ‌మ‌ని చెబుతున్నారు.

ఎందుకంటే.. ఉదయం.. మ‌ధ్యాహ్నం ఎండ వేడికి బ‌య‌ట‌కు రాని వేళ‌.. సాయంత్రం అయ్యేస‌రికి ప్ర‌జ‌లు త‌మ అవ‌స‌రాల కోసం ముఖ్య కూడ‌లికి రావ‌టం.. చుట్టూ ఉన్న ప‌ల్లెల‌కు చెందిన వారు కూడా సాయంత్రం అయ్యేస‌రికి ప‌ట్ట‌ణ‌కూడ‌లికి చేరుకోవ‌టం మామూలే. జ‌గ‌న్ వ‌స్తున్న నేప‌థ్యంలో ఆపార్టీ నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు.. అభిమానుల‌తో పాటు.. మిగిలిన ప్ర‌జ‌లంతా కూడా ఉండ‌టం.. ఆయ‌న చెప్పే మాట‌ల్లో ఏదైనా ఆస‌క్తిక‌ర‌మైన అంశాన్ని ప్ర‌క‌టిస్తార‌న్న  భావ‌న‌తో ఆఖ‌రి వ‌ర‌కూ ఆస‌క్తిగా విన్న‌ట్లు చెబుతున్నారు. ఇదే గుంటూరు జిల్లాలో జ‌నం విర‌గ‌బ‌డి రావ‌టానికి కార‌ణ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అటు వ్యూహం.. ఇటు ప్ర‌జాద‌ర‌ణ‌తో పాటు అధికారపార్టీలో నెల‌కొన్న అంత‌ర్గ‌త‌విభేదాలు వెర‌సి.. జ‌గ‌న్ పాద‌యాత్ర గుంటూరు జిల్లాలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌టానికి కార‌ణాలుగా చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News