ఇప్పుడంతా ఆన్ లైన్.. అరచేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చాక ఇంకా ప్రచారాలకు ఎవరు వస్తున్నారు.. పంచ్ డైలాగులు ఎందుకు పేలుస్తారు. అందుకే అంతా ఆన్ లైన్ లో పదునైన విమర్శలతో ఎండగట్టేందుకు పార్టీలు రెడీ అయ్యాయి. స్మార్ ఫోన్ ద్వారా సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని ప్రత్యర్థిని చేతగానితనాన్ని చూపిస్తూ ఓటరును తమకు మల్లేలా చేసుకుంటున్నాయి.
ఇది ఎన్నికల కాలం.. జనంలోకి వెళ్లే నాయకులకు సరైన భాష, యాస కావాలి.. ఆన్ లైన్ లో ప్రచారం చేసుకోవడానికి భాషపటిమ ఉన్న కంటెంట్ రైటర్లు కావాలి. అందుకే ఇప్పుడు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు రెడీ అయ్యాయి. ప్రెస్ మీట్లు - బహిరంగ సభల్లో మంచి ప్రసంగాలు రాయించుకుంటున్నాయి.
తెలంగాణలో 20 నుంచి 40 ఏళ్ల యువ ఓటర్ల చేతుల్లో స్మార్ట్ పోన్లున్నాయని సర్వేలో తేలింది. అందుకే మంచి విమర్శలను రైటర్లతో తయారు చేయించి సెటైర్లు - పంచ్ లు - ప్రాసలతో ప్రత్యర్థులపై ఆన్ లైన్ యుద్ధం చేయడానికి పార్లీలన్నీ రెడీ అయ్యాయి.
కంటెంట్ రైటర్లే కాదు.. వీడియో ఎడిటర్లు గ్రాఫిక్స్ డిజైనర్లకు ఎన్నికల వేళ ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ప్రచారంలోని తమ వీడియోలను ఫేస్ బుక్ - ట్విట్టర్ ద్వారా లైవ్ లో ఉంచడం.. అప్ లోడ్ చేయడం.. గ్రాఫిక్స్ జోడించడం వంటి వాటి కోసం ఇప్పుడు వీరిని భారీగా వేతనాలిచ్చి పార్టీలు నియమించుకుంటున్నాయి. అన్ని పార్టీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలన్న నిబంధనల విధించడంతో అభ్యర్థులు , ఆశావహులు ఖాతాలు తెరిచేశారు.
కొన్ని పార్టీలు ఫాలోవర్లను పెంచుకునేలా లైకులు కొట్టేందుకు, షేర్ చేసేందుకు ప్రత్యేకంగా ఫేక్ ఫాలోవర్లను ఎంచుకుంటున్నారు. వీటికి రూ.200 నుంచి రూ.400 వరకు చెల్లిస్తున్నారట.. వీరు సామాజిక మాద్యమాల్లో వీటిని ప్రచారం చేస్తున్నారు. రాత్రి పూట - షిఫ్టుల వారీగా వీరు విధుల్లో ఉంటూ హోరెత్తిస్తున్నారట..
ప్రస్తుతానికి తెలంగాణ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ సోషల్ వార్ లో ముందుంది. చాలా మంది కాంగ్రెస్ సానుభూతి పరులు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఓటు బ్యాంకును కాపాడుకుంటున్నారు. ఈ క్యాంపెయిన్ కు పలువురు ఎన్నారైలు బాసటగా నిలుస్తున్నారట.. ప్రస్తుతం సోషల్ మీడియాపై నెలనెలా పార్టీల లక్షల్లో ఖర్చు చేస్తున్నట్టు సమాచారం.
సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ విషయంలో తెలుగు భాషపై స్థానిక రాజకీయాలపై పట్టున్న కంటెంట్ రైటర్లు కావాలి. ఇందుకోసం సీనియర్లకు రూ.30వేల నుంచి రూ.70 వేల దాకా రిక్రూట్ చేసుకుంటున్నారు. కాగా నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఈ ఎన్నికల ఖర్చుకు లెక్క చూపించాల్సిన పని లేదు. దీంతో నెల ముందు నుంచి ఆన్ లైన్ లో క్యాంపెయిన్ హోరెత్తుతోంది.
ఇక తెలంగాణ ఎన్నికల్లో మార్ఫింగ్ లు హోరెత్తుతున్నాయి. హీరోల ముఖాలకు అభ్యర్థులు - సీఎం క్యాండిడేట్ల ముఖాలు తగిలించి సోషల్ మీడియాలో ఆయా పార్టీలు చెలరేగిపోతున్నాయి. వీటికి సంగీతం - స్క్రిప్ట్ - ఎడిటింగ్ డైలాగులు జోడించి కంటెంట్ రైటర్స్ - గ్రాఫిక్స్ డిజైనర్స్ - వీడియో ఎడిటర్లు రెండు చేతులా సంపాదించేస్తున్నారు.