బరువు తగ్గే ఇంజెక్షన్.. అమెరికా లో అదిరే డిమాండ్

Update: 2021-11-06 23:30 GMT
బరువు తగ్గటం జనాలు పడుతున్న పాట్లు అన్నిఇన్ని కావు. శారీరక శ్రమ తగ్గటం.. రోజు వారీ గా వ్యాయామం పెద్దగా లేకపోవటంతో బరువు అంత కంతకూ ఎక్కు వైపోతున్నారు. దీంతో.. బరువు తగ్గేందుకు ఉన్న అవకాశాల్ని ఎవరూ విడిచి పెట్టటం లేదు. అయితే.. బరువు తగ్గే విషయం లో ఎక్కువ శ్రమకు లోనుకాకుండా ఇట్టే తగ్గిపోవాలన్న ఆశ చాలామందిలో ఎక్కువ అవుతుంది. ఇందుకు తగ్గట్లే తాజాగా అమెరికాలో వచ్చిన ఒక ఇంజెక్షన్ ఇప్పుడు సంచలనంగా మారింది.

‘‘వీగోవీ’’ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఇంజెక్షన్ కు ఇప్పుడు అమెరికాలో భారీ డిమాండ్ ఏర్పడింది. బరువు తగ్గేందుకు ఇట్టే సాయం చేస్తుందన్న ప్రచారంతో ఈ ఇంజెక్షన్ కోసం మెడికల్ షాపులకు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నట్లుగా చెబుతున్నారు. దీంతో.. డిమాండ్ కు తగ్గట్లు ఇంజెక్షన్లను సరఫరా చేయలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఇంజెక్షన్ రూపంలో తీసుకున్నంతనే మొత్తం బరువులో 15 శాతం తగ్గే అవకాశం ఉన్న దీని కోసం పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నట్లుగా చెబుతున్నారు.

అమెరికాలో ఉబకాయులు ఎక్కువ. దేశ జనాభాలో మూడోవంత మంది కంటే ఎక్కువ మంది ఉబకాయ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. నోవోనోర్డిస్క్ అనే కంపెనీ తయారు చేసి వీగోవీ ఇంజెక్షన్ ను వారానికి ఒక డోసు చొప్పున నాలుగు వారాలు తీసుకోవాలి. ఆకలిని నియంత్రించటం ద్వారా బరువు తగ్గేందుకు ఈ మందు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అయితే.. ఈ ఇంజెక్ష న్ వాడిన వారికి వాంతులు.. యాసిడ్ రీఫ్లక్స్ లాంటి సైడ్ ఎఫెక్టులు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ ఔషధానికి ఈ ఏడాది జూన్ లో అమెరికా ప్రభుత్వం అనుమతుల్ని ఇచ్చింది.

గతంలో ఇలాంటి మందులకు సంబంధించి ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చేందుకు ప్రయత్నం చేసినా.. అనుమతులు లభించలేదు.కానీ.. వీగోవీ మార్కెట్లోకి రావటం.. ఆ వెంటనే భారీగా డిమాండ్ ఏర్పడటంతో.. ఇప్పుడా ఇంజెక్షన్ కోసం అమెరికన్లు వాడేస్తున్నారు. లేనిపోని మందుల్ని వాడే బదులు.. రోజువారీ శారీరక శ్రమతో పాటు మితంగా ఆహారం తీసుకోవటం ద్వారా బరువు తగ్గే అవకాశం ఉంది. అందుకే.. ఏవో మందులు వాడి బరువు తగ్గి.. సైడ్ ఎఫెక్టులు తెచ్చుకునే కన్నా.. పద్దతిగా బరువు తగ్గే సహజసిద్ధమైన విధానాల్ని ఫాలో కావటం మంచిదని చెప్పక తప్పదు.
Tags:    

Similar News