భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వేలాది పూరి గుడిసెలు తగలబడిన వైనం కలవరం సృష్టించటంతో పాటు.. కలకలం రేపుతోంది. కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని పాలిటిక్నిక్ కళాశాల సమీపంలో ప్రభుత్వ స్థలంలో పేదలు దాదాపు 3వేల పూరి గుడిసెల్ని వేసుకొని వాటిలో నివాసం ఉంటున్నారు.
గురువారం రాత్రి ఒక వృద్ధురాలు వంట చేసుకుంటుండగా అగ్గి రవ్వలు ఎగిసి పడ్డాయి. గుడిసెకు నిప్పు అంటుకుంది. వెంటనే పక్కనున్న గుడిసెకు నిప్పు అంటుకుంది. ఇలా చూస్తుండగానే ఒక్కొక్క గుడిసె అంటుకొని.. కొద్దిసేపట్లోనే 2వేల గుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. అయితే.. ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకునే సమయంలో ఎలాంటి ప్రాణహాని చోటు చేసుకోకపోవటం కొంతలో కొంత ఊరటనిచ్చే అంశం.
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో గుడిసెల్లోని వారు ఇళ్ల పట్టాల విషయమై ఒక చోట సమావేం కావటంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. గుడిసెల్లోని దాదాపు 20 వంట గ్యాస్ సిలిండర్లు పేలటంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయంతో పరుగులు తీశారు. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న బద్వేలు.. పోరుమామిళ్ల.. కడప.. మైదకూరు నుంచి వచ్చిన ఫైరింజన్లు మంటల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే.. రెండు వేల గుడిసెలు అగ్నికి ఆహుతి కావటంతో.. వేలాది మంది కట్టుబట్టలతో నిరాశ్రయులైన పరిస్థితి నెలకొంది. ఈ అగ్నిప్రమాదంపై కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.