తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీక్షకు జనసమీకరణ కోసం అధికార పార్టీ నిబంధనలను యథేచ్చగా తుంగలో తొక్కుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ దీక్షకు స్వచ్ఛందంగా హాజరయ్యే వారి సంఖ్య నామమాత్రంగానే ఉండే నేపథ్యంలో బలవంతపు తరలింపునకు సిద్ధమై కేవలం మౌఖిక ఆదేశాలే కాకుండా ఏకంగా నోటీసులు సైతం పంపుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు శుక్రవారం అధికారికంగా చేపడుతున్న ధర్మ పోరాట దీక్షకు పెద్దఎత్తున ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. సీఎం తొలిసారిగా చేస్తున్న ఈ దీక్షకు విద్యార్థులు - డ్వాక్రా మహిళలను తరలించాలని అధికార పార్టీ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వ - ఎయిడెడ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు విధిగా ఈ దీక్ష వద్దకు రావాలంటూ మెసేజ్ లు పెడుతున్నారు. విద్యార్థులను తీసుకురావాలని కళాశాలలకూ నోటీసులు పంపించడం గమనార్హం. అయితే వేసవి సెలవుల్లో తాము విద్యార్థులను ఎలా తరలించేందని కాలేజీ లెక్చరర్లు నెత్తినోరు బాదుకుంటున్నప్పటికీ అధికార పార్టీ నేతలు వినిపించుకోవడం లేదని తెలుస్తోంది.
బాబు దీక్షను పూర్తిగా విజయవంతం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం మొత్తం బాధ్యతను మంత్రులకు అప్పగించింది. ఇన్ ఛార్జి మంత్రులు ఇందుకు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు. ఇందులో భాగంగా విద్యార్థులతో పాటుగా డ్వాక్రా మహిళలను తరలించేందుకు యానిమేటర్లకు ఆదేశాలిచ్చారు. గుంటూరు - కృష్ణా జిల్లాల నుంచి మహిళల తరలింపు బాధ్యతను తహశీల్దార్లకు అప్పగించారు. రవాణా సదుపాయాలు కల్పించాల్సిందిగా కృష్ణా జిల్లా రవాణాశాఖకు బాధ్యతలు అప్పగించారు. తరలించేవారికి కావాల్సిన సదుపాయాలన్నీ తహశీల్దార్లే చూసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. జిల్లాల్లో నిర్వహించే దీక్షలకూ డ్వాక్రా మహిళలను తరలించాలని ఆదేశాలు జారీ చేయడంతో కొందరు అధికారులు తలలు పట్టుకుంటున్నారని సమాచారం. దీనికి మంత్రులు - ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. ఖర్చును పూర్తిగా ప్రభుత్వ పరంగానే వెచ్చించనున్నారు. సంక్షేమ పథకాలు పొందుతున్న వారంతా కచ్చితంగా కార్యక్రమానికి వచ్చేలా చూడాల్సిన బాధ్యతను అధికారులు - సిబ్బందికి అప్పగించారు.
చంద్రబాబు దీక్ష చేయనున్న ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లను వేగవంతం చేశారు. మూడువేల మంది కూర్చునే విధంగా సీటింగు ఏర్పాటు చేస్తున్నారు. మంత్రులు దగ్గరుండి కార్యక్రమాలను పర్యవేక్షిస్తుండటంతో పాటుగా ప్రభుత్వం కూడా ప్రత్యేక అధికారులను నియమించింది. విజయవాడలో జరిగే దీక్షలో ముఖ్యమంత్రితోపాటు ఐదుగురు మంత్రులు పాల్గొంటారు. మిగిలిన వారంతా జిల్లాల్లో పాల్గొంటారు. ఎంపీలు కూడా జిల్లాల్లోనే దీక్షలో పాల్గొనాలని పార్టీ నుండి ఆదేశాలు వెెళ్లాయి. ఈ దీక్ష ద్వారా బీజేపీ - వైసీపీపై పూర్తిస్థాయిలో ఎదురుదాడి చేయాలని సూచిస్తూ - దీనికి అవసరమైన సమాచారాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం నుండి పంపించారని సమాచారం.