కేంద్రం సంచలనం: పెట్రోల్ , డీజిల్ ధరల భారీ తగ్గింపు

Update: 2021-11-03 15:07 GMT
పెట్రో రేట్లు పట్టపగ్గాలు లేకుండా పెరుగుతున్నాయి. అడిగే నాథులే లేకుండా పోవడంతో ‘తగ్గేదే లే’ అన్నట్టుగా పెరుగుకుంటూ పోతోంది. దేశంలో పెట్రో రేటు సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. రోజుకు కొంత పెరుగుతూ ఇప్పటి వరకు 110 రూపాయలకు చేరింది. సంవత్సరాలు గడిచినా పదో, ఇరవై రూపాయలో పెరిగిన రోజులుండగా.. ఈసారి ఒకే ఏడాదిలో గనణీయంగా పెరిగింది. సామాన్యుడి నిత్యావసరం అయిన పెట్రోల్ ధరల పెరుగుదలతో దేశవ్యాప్తంగా అన్ని రేట్లు పెరిగి ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది.

 ఏడాదిలో ఏకంగా రూ. 36 పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒకే సంవత్సరంలో రూ. 36 పెరగడంతో పాటు ఇంకా ఈ ధరలు నిలుపుదల కాలేదు. ఇప్పటికీ పెరుగుతూనే ఉన్నాయి. అయితే పెట్రోల్ ధరలు అంతర్జాతీయ సమస్య అని ఆ ధరలను ఎవరూ నియంత్రించలేరని కేంద్ర ప్రభుత్వం అంటోంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ పన్ను విధించడంతోనే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని కేంద్రం అంటోంది. తాజాగా దేశ ప్రజలకు దీపావళి కానుకగా గుడ్ న్యూస్ చెప్పింది.

దేశంలో పట్టపగ్గాల్లేకుండా పెరిగిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలను దీపావళి సందర్భంగా కేంద్రం తగ్గించింది. ప్రజలపై కరుణ చూపింది. భారత ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా వాహనదారులకు శుభవార్త చెప్పింది. ఇంధన ధరలపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.

రేపటి నుంచి పెట్రోల్ , డీజిల్ పై ఎక్సైజ్ సుంకం వరుసగా రూ.5, రూ.10 తగ్గిస్తున్నట్టు పేర్కొంది. ఈ ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.

తగ్గించిన ధరలు రేపటి నుంచి అమలు కానున్నాయి. వాహనదారులకు మరింత ఉపశమనం కలిగించేందుకు రాష్ట్రాలు కూడా పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని సూచించింది.
Tags:    

Similar News