స్థానిక సంస్థల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. అధికార పార్టీ హవాకు ప్రతిపక్షాలు కుదేలవుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లిచనట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మిగతా పక్షాలను పెద్దగా పోటీగా వైఎస్సార్సీపీ భావించడం లేదు. దీంతో ప్రధానంగా టీడీపీపై ఫోకస్ పెట్టి ఆ పార్టీని భారీగా దెబ్బతీస్తున్నారు. అయితే ఇది రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో అవేవి చెల్లవు.. టీడీపీ హవా కొనసాగిస్తుందని భావిస్తుండగా ఇక్కడ టీడీపీకి భారీగా ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రంలోనే అత్యధికంగా చిత్తూరు జిల్లాలోనే ఏకగ్రీవ జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఎన్నికయ్యాయి. దీంతో చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవానికి విశేష ప్రాధాన్యం ఇస్తారు. ఎన్ని ఏకగ్రీవాలు సాధిస్తే ఆ నియోజకవర్గంలో నాయకుడికి, ఆ పార్టీకి అంత బలం ఉందని నిరూపించుకుంటుంటారు. అయితే ఈ ఏకగ్రీవాలు ఎక్కడ దాదాపుగా సాధ్యం కాదు. కానీ నయానో.. భయానో ఇతరులను ఒప్పించి నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటుండడం అన్ని పార్టీలు చేస్తుంటాయి. ముఖ్యంగా అధికార పార్టీ ఈ పని చేస్తుంటుంది. ప్రోత్సాహాకాలు, నిధుల పేరు చెబుతూనే ప్రత్యర్థులకు ఎంతో కొంత ముట్టజెప్పి సైడ్ చేస్తారు. ఈ ఏకగ్రీవ స్థానాలన్ని సాధారణంగా అధికార పార్టీవిగా పరిగణిస్తారు. ఈ విధంగా రాష్ట్రంలో మొత్తం 24 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి.
ఇక చంద్రబాబు సొంత జిల్లా.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం కూడా ఇదే జిల్లాలో ఉంది. అయితే ఈ ఏకగ్రీవమైన 24 స్థానాల్లో 9 జెడ్పీటీసీ స్థానాలు చిత్తూరు జిల్లావే ఉన్నాయి. ఈ జిల్లాలో ఎంపీటీసీ స్థానాలు అత్యధికంగా 170 ఏకగ్రీవమయ్యాయి. దీంతో చంద్రబాబుకు దిమ్మతిరిగేలా స్థానిక సంస్థల ఎన్నికల తీరు ఉంది. అన్నేసి స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీలో లేకపోవడంతో అధికార పార్టీ వాటిని ఏకగ్రీవం చేసుకునేలా వ్యూహాలు కదిపింది.
సొంత ప్రాంతంలోనూ.. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత ఊరు నారావారి పల్లె చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. చంద్రబాబు ప్రస్తుతం కుప్పం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. చంద్రగిరి కూడా ఆయనకు కీలకమే. ప్రస్తుత స్థానికల్లో చంద్రగిరి నియోజకవర్గంలోనూ టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గంలోని 95 ఎంపీటీసీల్లో 76 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవాలైన ఎంపీటీసీ స్ధానాలన్నీ వైఎస్సార్సీపీవే. మిగిలిన 19 స్థానాలు ఉండగా వాటిలో కూడా కొన్ని ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇంకా ఉంది. దీంతో చంద్రబాబుకు సొంత జిల్లాతో పాటు స్వగ్రామం ఉన్న నియోజకవర్గంలోనూ తీవ్ర ఎదురుదెబ్బ తగులుతోంది.
మొదటి నుంచి ఈ ఎన్నికల్లో పోటీపై టీడీపీ ఆసక్తి కనబర్చడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉండడంతో పార్టీ నాయకులంతా పోటీకి జంకుతున్నారు. ఇతర జిల్లాలు వేరు కానీ చంద్రబాబు సొంత జిల్లా కావడంతో కొంత ప్రాధాన్యమిస్తారోమేనని భావిస్తే ఇక్కడ సేమ్ సీన్. అసలు ప్రతిపక్షం పోటీలో ఉండకుండా అధికార పార్టీ వ్యూహం రచించి విజయం సాధించింది. ఇక తుది పోరులో కూడా టీడీపీకి చెక్ పెట్టి అధికార పార్టీ అత్యధిక స్థానాలు సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ఈ పరిణామాలపై నోరు మెదపడం లేదు. జగన్ దెబ్బకు చంద్రబాబు చితికిపోతున్నాడు.