విశాఖ ఉక్కుపై రాజ్యసభలో విజయసాయికి మరో షాకు తప్పలేదు

Update: 2021-03-23 03:52 GMT
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు విషయంలో మోడీ సర్కారు వెనకుడుగు వేసేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేదన్న విషయాన్ని తాజాగా మరోసారి స్పష్టమైంది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా..ఆ నిరసనల్ని.. ఆందోళల్ని లైట్ తీసుకుంటున్న కేంద్రం.. తాము వెల్లడించిన నిర్ణయం విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

దేశంలో ఉక్కు పరిశ్రమలు కోకింగ్ కోల్ కొరతను ఎదుర్కొంటున్న విషయం వాస్తవమేనని చెప్పిన కేంద్రమంత్రి.. ఈ కారణంతోనే విదేశాల నుంచి కోల్  దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత బొగ్గు గనులు కేటాయించే పరిస్థితి లేదని పరోక్షంగా స్పష్టం చెప్పేయటం ద్వారా.. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే విషయంలో ఏ మాత్రం వెనకుడుగు వేసే ఆలోచన లేదన్న విషయాన్ని ఆయన చెప్పేసినట్లైంది.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి అడిగిన ప్రశ్నకు బదులిచ్చే క్రమంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ.. దేశంలోని వివిధ స్టీల్ ప్లాంట్లకు ప్రభుత్వం కేటాయించిన సొంత బొగ్గు గనుల వివరాల్ని వెల్లడించారు. ఇదిలా ఉంటే.. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే విషయంలో కేంద్రం తీరును తాము అంగీకరించేది లేదని విజయసాయి స్పష్టం చేశారు. ప్రైవేటు సంస్థలు లాభార్జనే ధ్యేయంగా పని చేస్తాయని.. ప్రభుత్వ రంగ సంస్థలు సామాజిక బాధ్యతను నెరవేర్చేలా పని చేస్తాయని.. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. విజయసాయి ఎంత చెప్పినా.. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే విషయంలో మోడీ సర్కారు వెనక్కి తగ్గేదే లేదన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేసినట్లైంది.
Tags:    

Similar News