హైదరాబాద్ కు ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం.. అచ్చం తిమింగలమే?

Update: 2022-12-06 02:30 GMT
మన హైదరాబాద్ కు అరుదైన అనుకోని అతిథి వచ్చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ల్యాండ్ అయ్యింది. అచ్చం తిమింగళం ఆకారంలోని ఈ ఎయిర్ బస్ బెలూగా విమానం హైదరాబాద్ లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విశిష్ట అతిథికి హైదరాబాద్ ఎయిర్ పోర్టు వర్గాలు స్వాగతం పలికాయి.

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) గత రాత్రి ఒక ప్రత్యేకమైన సందర్శకుడిని చూసింది. ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాలలో ఒకటైన ఎయిర్‌బస్ బెలూగా డిసెంబర్ 4న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది.

శంషాబాద్ విమానాశ్రయ అధికారులు దాని ల్యాండింగ్, పార్కింగ్ మరియు టేకాఫ్ కోసం ఏర్పాట్లు చేశారు. సూపర్ ట్రాన్స్‌పోర్టర్ డిసెంబర్ 5 రాత్రి 7:20 గంటల వరకు హైదరాబాద్‌లో ఉంటుందని భావిస్తున్నారు.

మొదటిసారిగా విమానం కోల్‌కతా విమానాశ్రయంలో నవంబర్ 20న కనిపించింది. బెలూగా తిమింగలం ఆకారంలో ఉండే ఒక అతిపెద్ద సరుకు రవాణా విమానం. నవంబర్ 22న ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా ఇది కనిపించింది.

ఎయిర్‌బస్ A300-600ST అని కూడా దీన్ని పిలుస్తారు, ఈ విమానం కోల్‌కతాలో మొదటిసారి కనిపించినప్పటి నుండి వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో దీని ప్రత్యేకతలపై చర్చ సాగుతోంది.

ఇది భారీ కార్గో విమానం.  సెమీ ఆటోమేటెడ్ మెయిన్ డెక్ కార్గో లోడింగ్ సిస్టమ్‌తో అమర్చబడి ఉంటుంది. అక్టోబర్ 2022లో  హాట్ బర్డ్ 13G అనే ఉపగ్రహాన్ని ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్‌లోని కెన్నెడీ స్పేస్ సెంటర్‌కు ఈ భారీ విమానంలోనే తీసుకొచ్చారు.  

మే 2016లో సోవియట్ యూనియన్‌లోని ఆంటోనోవ్ డిజైన్ బ్యూరో రూపొందించి  ఉత్పత్తి చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో ఎయిర్‌క్రాఫ్ట్ అంటోనోవ్ ఏఎన్-225, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ల్యాండింగ్ చేయబడింది. 116 టన్నుల బరువున్న జనరేటర్‌ను తీసుకెళ్తుండగా సాంకేతిక లోపంతో హైదరాబాద్‌ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయింది.

ఎయిర్ బస్ సంస్థ తయారు చేసిన ఈ బెలూగా విమానం పొడవు 56 మీటర్లు కాగా.. బరువు 95 టన్నులు.. ఇది 56 అడుగుల ఎత్తు ఉంటుంది. ఎయిర్ బస్ సంస్థ దీన్ని తిమింగలం రూపంలో డిజైన్ చేసింది. ఇది చూడడానికి అందరినీ ఆకర్శించేలా ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

https://twitter.com/shinenewshyd/status/1599697253312364544?s=20&t=Lw9sm--3mTyEcLdjflKhAQ
Tags:    

Similar News