హైదరాబాద్ లో 'రిస్క్' తక్కువంట

Update: 2015-09-05 18:12 GMT
భాగ్యనగరి పేరు చెబితేనే బిర్యానీ పేరుతో పాటు చార్మినార్.. ముత్యాలు.. ఐటీ.. ఇలా చాలానే చెబుతుంటారు. వీటన్నింటితో పాటు.. అతి ముఖ్యమైన భద్రత విషయంలోనూ హైదరాబాద్ బెస్ట్ అన్న విషయం తాజాగా చేసిన ఒక లెక్కలో తేలింది.

దేశంలో భద్రంగా ఉండి.. రిస్క్ తక్కువగా ఉండే నగరాల లెక్కల ఒకటి వేశారు. బీమా కంపెనీల్లో పేరున్న సంస్థ ఒకటి తాజా చేపట్టిన ఒక సర్వే నివేదిక బయటకు వచ్చింది. దీని ప్రకారం.. దేశంలో అత్యంత రిస్క్ తక్కువ ఉన్న నగరాల్లో హైదరాబాద్.. బెంగళూరు అని తేల్చారు.

ఇక.. రిస్క్ ఎక్కువగా ఉండే నగరాల్లో మొదటి స్థానంలో దేశ ఆర్థిక రాజధాని ముంబయి తేలితే.. రెండో స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ పేరు వచ్చింది. ఆ తర్వాత రిస్క్ ఎక్కువగా ఉండే నగరాల్లో కోల్ కతా.. అహ్మాదాబాద్.. పూణే.. చెన్నై.. సూరత్.. కాన్పూరు నగరాలున్నాయి. ఇక.. భద్రంగా ఉండే నగరాల్లో హైదరాబాద్.. బెంగళూరు నగరాలుగా తేల్చారు. ప్రకృతి వైపరీత్యాలు.. టెర్రరిజం ముప్పుతో పాటు.. మిగిలిన విషయాల్లో కూడా ఈ రెండు దక్షిణాది మహానగరాలు చివర్లో ఉండటం గమనార్హం.
Tags:    

Similar News