అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో పాటు.. అత్యంత ప్రమాదకర రోగులకు వైద్యసేవలు అందిస్తున్న దవాఖానా సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి. ముప్ఫై ఎకరాల విస్తీర్ణంలో 1100కు పైనే బెడ్లు ఉన్న ఈ ఆసుపత్రిని ప్రస్తుతం కోవిడ్ 19 కోసం ప్రత్యేక ఆసుపత్రిగా గుర్తించిన వైనం తెలిసిందే. అలాంటి ఆసుపత్రిలో తాజాగా చోటు చేసుకున్నట్లుగా చెబుతున్న ఒక ఉదంతం కొత్త కలకలాన్ని రేపుతోంది.
తాజాగా గాంధీ ఆసుపత్రి సెల్లార్ లో కొందరు సిబ్బంది మందు పార్టీ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ సాగిన ఈ పార్టీ వ్యవహారం బయటకు రావటానికి కారణం.. ఆ పార్టీలో పాల్గొన్నఒక వ్యక్తి గుండెపోటుతో మరణించటమే.
కాంట్రాక్టు పద్దతిలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులు మందు.. మటన్ తో పార్టీ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఫుల్ బాటిల్ లో గాంధీ సెల్లార్ లో జరుపుకున్న ఈ పార్టీ అనంతరం ముగ్గురు ఎవరిళ్లకు వారు వెళ్లారు. అయితే.. వారిలో ఒకరు అనూహ్యంగా గుండె పోటుతో కుప్పకూలిపోయారు. కంగారు పడ్డ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించినట్లుగా చెబుతున్నారు.
అతడి మరణంతో గాంధీలో జరిగిన మందుపార్టీ ఉదంతం బయటకు వచ్చింది. దీనిపై ఆసుపత్రి ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. అంతర్గత విచారణకు ఆదేశాలుజారీ చేసినట్లుగా తెలుస్తోంది. కొందరు చేసే పనులతో కొత్త తలనొప్పులు రావటం పై గాంధీ ఉన్నతాధికారులు తల పట్టుకుంటున్నట్లు సమాచారం.