తెలంగాణకు కేరళ నర్సులు.. ఇందుకే

Update: 2020-06-29 06:30 GMT
హైదరాబాద్‌ లో మహమ్మారి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ కేసులతో అన్ని ప్రధాన ఆసుపత్రులు - మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులు రద్దీగా మారాయి.  తెలంగాణ రాష్ట్రంలో రోజుకు సగటున 1000 కేసులు ఉండగా, మెరుగైన చికిత్స కోసం రోగులు, వారి బంధువులందరూ హైదరాబాద్‌కు తరలివస్తున్నారు. దీనివల్ల పడకలు, ప్రత్యేక వార్డులు.. ఎక్కువ మంది వైద్య సిబ్బందికి అధిక డిమాండ్ ఉంది.

అలాగే మహమ్మారి రోగులకు చికిత్స చేస్తున్న చాలా మంది వైద్యులు, నర్సులు కూడా మహమ్మారి బారిన పడున్నారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యులు, నర్సులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అత్యవసర పరిస్థితిలో వ్యాధుల రోగుల చికిత్స - వ్యక్తిగత సంరక్షణను నిర్వహించేందుకు మన వైద్యులు కూడా భయపడుతున్నారు.. కోవిడ్ రోగులకు చికిత్స చేయడానికి  అన్ని ప్రధాన ఆసుపత్రులలో వైద్య సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో  పేషెంట్లు - ఇన్‌పేషెంట్లు ఇద్దరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు.

జీహెచ్‌ఎంసీ తో పాటు తెలంగాణ లోని ఇతర జిల్లాల్లో మహమ్మారి కేసులు వేగం గా పెరుగుతున్నందున, చికిత్స కోసం డిమాండ్ పెరుగుతోంది. దీంతో కేరళ నుంచి నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని పిలిపించాలని పలువురు ఆసుపత్రి యాజమాన్యాలు నిర్ణయించాయి. కేరళలో ప్రస్తుతం మహమ్మారి కంట్రోల్ అయ్యింది. దీంతో అక్కడ భారీగా ఉన్న నర్సులు ఖాళీగానే ఉన్నారు. అందుకే కేరళ నుంచి నర్సులను తీసుకురావడానికి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. కేరళ నుండి కొత్తగా వస్తున్న నర్సులు - వైద్య సిబ్బంది కి వసతి కల్పించడానికి ఆసుపత్రి నిర్వాహకులు కొత్త స్థలాలను అద్దెకు తీసుకున్నారు. వారికి మహమ్మారి సోకకుండా పకడ్బందీగా వసతి కల్పించారు. కొన్ని ఆస్పత్రులు సమీపంలోని కొన్ని హాస్టళ్లలో వసతిని కల్పించేందుకు వాటిని అద్దెకు తీసుకుంటున్నాయి.

ఇప్పటికే రెండు ప్రధాన ఆసుపత్రులు 50 మంది నర్సులను చార్టర్డ్ విమానంలో కేరళ నుంచి తీసుకొచ్చినట్లు తెలిసింది. వీరికి అధినే వేతనాలను ఆఫర్ చేసి ఆస్పత్రులు  ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం  ఆస్పత్రులలో నర్సులకు అధిక డిమాండ్ ఉందని, వారికి నెలకు రూ .50 వేల వరకు జీతం ఇస్తున్నారని తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తెలిపింది. తెలంగాణలో నర్సులు, వైద్య సిబ్బందికి ఇచ్చే సాధారణ జీతం కంటే కేరళ వారికి ఇచ్చేది  మూడు రెట్లు ఎక్కువ అని అంటున్నారు.

3 నుంచి 4 రోజుల్లో తెలంగాణలోని జీహెచ్‌ఎంసీలో మరో లాక్‌డౌన్ విధించబోతున్నందున, ఆస్పత్రులు అన్ని సదుపాయాలను సమకూర్చుకుంటున్నాయి. రాబోయే అత్యవసర పరిస్థితులకు సిద్ధం కావడానికి కేరళ నుండి  కొత్త సిబ్బందిని నియమించుకుంటున్నాయి.
Tags:    

Similar News