లండన్ లో హత్య.. కేసీఆర్ ఆశ్రయించిన బాధితులు..

Update: 2019-05-10 06:48 GMT
లండన్ లో హైదరాబాదీ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువకుడితో పాటు పనిచేసే సహ ఉద్యోగే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసింది.

హైదరాబాద్ నూర్ ఖాన్ బజార్ కు చెందిన యువకుడు మహ్మద్ నదీమొద్దీన్ జీవనోపాధి కోసం ఆరేళ్ల కిందట లండన్ వెళ్లాడు. టెస్కో సూపర్ మార్కెట్ లో సేల్స్ రిప్రంజెంటీటివ్ గా పనిచేస్తున్నాడు. అయితే రాత్రి ఇంటికి రాకపోవడంతో నదీమొద్దీన్ భార్య సూపర్ మార్కెట్ యజమానికి ఫోన్ చేసింది. దీంతో యజమాని - సిబ్బంది మాల్ ఆవరణలో గాలించారు. పార్కింగ్ లో నదీమొద్దీన్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం హైదరాబాద్ లోని నదీమొద్దీన్ కుటుంబ సభ్యులకు - ఆయన భార్యకు సమాచారం అందించారు.

నదీమొద్దీన్ భార్య ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. అతడిని సన్నిహితులు చంపారా లేక సహ ఉద్యోగులే హత్య చేశారా అన్న విషయంపై ప్రాథమికంగా నిర్ధారించారు.

ఆరేళ్లుగా నదీమొద్దీన్ బ్రిటన్ లో ఉంటున్నారు. అక్కడి పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని రోజుల్లో ఇది పూర్తి అవ్వబోతుండగా ఇలా హత్యకు గురికావడం వారి కుటుంబంలో విషాదం నింపింది.

కాగా నదీమొద్దీన్ మృతదేహాన్ని భారత్ కు రప్పించాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ ను కోరారు. దీంతో రంగంలోకి దిగిన మంత్రి మహమూద్ అలీ, విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించారు. తానే లండన్ వెళ్లి తీసుకొస్తానని మహమూద్ అలీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
   

Tags:    

Similar News