కరోనా వచ్చింది. లాక్ డౌన్ అమలవుతుంది. ఇప్పటికి మూడు దఫాలుగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. మొదటి రెండింటితో పోలిస్తే.. మూడో లాక్ డౌన్ లో పలు నిబంధనల్ని సడలించటం తెలిసిందే. మద్యం దుకాణాల్ని తెరవటంతో పాటు.. నిర్మాణ.. వ్యవసాయ రంగానికి సంబంధించిన షాపుల్ని తెరిచేందుకు వీలుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రానున్న రోజుల్లో మరిన్ని నిబంధనల్ని సడలించే వీలుందన్న మాట వినిపిస్తోంది.
అన్నింటి సంగతి సరే.. ప్రజా రవాణా పరిస్థితి ఏమిటి? అన్నది ఒక ప్రశ్న అయితే.. కరోనా వేళ.. సమస్యలు తలెత్తకుండా ప్రజా రవాణాను ఎలా ఆపరేట్ చేస్తారన్నది ప్రశ్నగా మారింది. దీనిపై తాజాగా ఆసక్తికర సమాచారం బయటకు వస్తోంది. హైదరాబాద్ ప్రజా రవాణా రూపురేఖల్ని మార్చేసిన హైదరాబాద్ మెట్రోను పరుగులు తీసేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.
కరోనా కారణంగా మెట్రో రైలుకు రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లుగా చెబుతున్నారు. కరోనా ప్రభావం ఇప్పటికిప్పుడు తగ్గే అవకాశం లేకపోవటం.. దాంతో సహజీవనం తప్పనిసరి కావటంతో ప్రజా రవాణాను సరికొత్త రీతిలో నడిపే ఆలోచనలో అధికారులు ఉన్నారు. హైదరాబాద్ మెట్రో విషయానికి వస్తే.. లాక్ డౌన్ నిబంధనలకు తగ్గట్లు కొత్త విధానాన్ని సిద్ధం చేసినట్లుగా సమాచారం.
లాక్ డౌన్ కు ముందు వరకూ హైదరాబాద్ మెట్రో రోజువారీగా అరవై రైళ్లను నడపటం తెలిసిందే. గడిచిన కొన్ని వారాలుగా ఈ రైళ్లు మొత్తం డిపోలకే పరిమితమయ్యాయి. ఒక్కో రైలులో ప్రయాణికుల సామర్థ్యం మూడు బోగీలతో కలిపి 900. కరోనా నేపథ్యంలో భౌతికదూరాన్ని పాటిస్తూ సగానికి పైగా ప్రయాణికుల్ని తగ్గించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మెట్రోలో సీటింగ్ మధ్య గ్యాప్ తో పాటు.. నిలుచునే విషయంలోనూ.. వైట్ బాక్సుల్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రయాణికులు ఈ బాక్సుల్లో మాత్రమే నిలుచోవాలని.. అంతకు మించి రైళ్లలోకి అనుమతించకుండా కొత్త నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెల ఆఖరులో కానీ.. వచ్చే నెల మొదటి వారం తర్వాత కానీ హైదరాబాద్ మెట్రో పరుగులు తీసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.