రేవంత్ రెడ్డి ఫ్లాష్ మాబ్ అనగానే.. ఆయన వచ్చి డ్యాన్సులు వేశాడని ఊహించుకోకండి. రేవంత్ రెడ్డి మాస్క్ లు వేసుకున్న కొంతమంది కుర్రాళ్లు ఫ్లాష్ మాబ్ చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో మెట్రో అంటే తెలియని వారుండరు. దీంతో.. రేవంత్ రెడ్డి కోసం ప్రచారం చేయాలనుకున్న కొంతమంది కుర్రాళ్లు రేవంత్ రెడ్డి మాస్క్ లు కట్టుకుని మెట్రో రైల్ లో ఫ్లాష్ మాబ్ నిర్వహించారు.
ఫ్లాష్ మాబ్. మూడేళ్ల క్రితం ప్రపంచాన్ని ఊపేసిన కాన్సెప్ట్. అప్పటివరకు సైలెంట్ గా ఉన్నవాళ్లు కాస్తా లయబద్ధంగా.. మ్యూజిక్ తగ్గట్లుగా డ్యాన్సులు వేయడం మొదలుపెడతారు. దీంతో.. ఒక్కసారిగా అందరి దృష్టి ప్లాష్ మాబ్ పై పడుతుంది. అప్పట్లో చాలా ఫేమస్ అయిన ఈ కాన్సెప్ట్ ని ఇప్పుడు ఉపయోగించుకుని రేవంత్‌రెడ్డి కోసం ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
2018 ఎన్నికల్లో కొడంగల్ లో పరాజయం పాలైన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మల్కాజ్ గిరీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి తన సత్తా ఏంటో చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. రేవంత్ రెడ్డికి పోటీగా టీఆర్ ఎస్.. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని రంగంలోగి దింపింది. ప్రస్తుతం ఇద్దరు అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే.. ఇప్పుడీ ఫ్లాష్ మాబ్ తో ప్రచారంలో తాను అడ్వాన్స్ గా ఉన్నానని మరోసారి నిరూపించుకున్నారు రేవంత్ రెడ్డి.