మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరం లోకి అడుగు పెట్ట బోతున్నాం. దీనితో సెలబ్రేషన్స్ కు అంతా రెడీ అవుతున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన ఏడాది కి స్వాగతం చెబుతూ ఉత్సాహంగా గడుపుతారు. పార్టీలు చేసుకుంటారు. అర్థరాత్రి కేక్ కట్ చేసి విషెస్ తెలుపుకుంటారు. ఇక యువత గురించి చెప్పక్కర్లేదు. వాళ్లు చేసే హంగామా అంతా ఇంతా కాదు. బైక్ లు, కార్ల మీద తిరుగుతూ న్యూ ఇయర్ కి వెల్ కమ్ చెబుతారు. కేరింతల్లో మునిగి తేలుతారు. ఇక ఈ వేడుకల్లో మద్యం ఏరులై పారడం మాములే.
కానీ , గత కొన్ని రోజులు గా హైదరాబాద్ నగరం లో జరుగుతున్న దారుణాలని పరిగణ లోకి తీసుకోని నగర పోలీసులు ఈసారి కొన్ని కఠిన నియమాలు పెట్టారు. ముఖ్యంగా ఆడ పిల్లలు ఒంటరి గా రోడ్ల పైకి రావొద్దు అని , స్నేహితులు కానీ , సోదరులు కానీ తోడు ఉంటేనే బయటకి రావాలని చెప్పారు. అలాగే బయట పార్టీలకి కేవలం రాత్రి 12 :30 వరకు మాత్రమే టైం ఇచ్చారు. ఆ తరువాత తెల్లవారు జాము నాలుగు గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు.
కానీ , న్యూ ఇయర్ వేడుకల్లో మందు తాగని వారంటూ ఎవరు ఉండరు. దీనితో ఈసారి పార్టీ చేసుకొని ఇంటికి వెళ్లడం కొంచెం కష్టం అవుతుంది అని కొంతమంది మందు బాబులు తెగ ఫీల్ అవుతున్నారు. దీన్ని గమనించిన హైదరాబాద్ పబ్ నిర్వాహకులు .. న్యూ ఇయర్ సందర్భంగా వచ్చే కస్టమర్ల కి బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. పార్టీలో ఫుల్ తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ ఇబ్బందితో ఇంటికి వెళ్లలేని మందు బాబులని ..క్షేమంగా వారి ఇంటికి చేర్చే భాద్యత మాది అంటూ ప్రకటిస్తున్నారు. దీనికోసం ముందుగానే కస్టమర్ల నుండి ఛార్జి వసూలు చేయబోతున్నారు. ఇటు న్యూ ఇయర్ రోజు తాగి రోడ్ల పైకి వస్తే కఠిన చర్యలు తప్పవు అని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్న ఈ సమయంలో పబ్ నిర్వాహకులు ప్రకటించిన ఈ ఆఫర్ వైపు యువత ఉత్సహం చూపిస్తున్నట్టు తెలుస్తుంది.