హైద‌రాబాదీ సాఫ్ట్ వేర్ చేసిన ప‌ని వింటే షాకే

Update: 2017-04-13 06:40 GMT
ఈ ఉదంతం వింటే.. మ‌నిషి ఇంత చెత్త‌గా ఎలా మారుతున్నాడో అర్థం కాక‌పోవ‌ట‌మే కాదు.. ఆలోచిస్తే.. అంతకంత‌కూ భ‌యం వేయ‌టం ఖాయం. పెరిగిన టెక్నాల‌జీ పుణ్య‌మా అని ప్రైవ‌సీ అన్న‌ది లేకుండా పోయిన ఈ రోజుల్లో.. న‌మ్మిన వ్య‌క్తి ఏ మాత్రం తేడా చేసినా ప‌రిస్థితి ఎంత భ‌యంక‌రంగా ఉంటుందో ఈ ఉదంతం చెబుతుంది. క‌ట్టుకున్నోడికి కానీ పాడు బుద్ధి ఉంటే.. ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉంటుంద‌న్న విష‌యాన్ని ఈ ఇష్యూ బ‌య‌ట‌పెడుతోంది. క‌ల‌లో కూడా ఊహించ‌ని చెత్త ప‌ని చేసిన హైద‌రాబాద్‌ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ ఉదంతం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

సుల‌భంగా డ‌బ్బులు సంపాదించొచ్చ‌న్న ఉద్దేశంతో భార్య‌తో బెడ్రూం గ‌డిపే దృశ్యాల్ని లైవ్ స్టీమ్ నీచానికి దిగ‌జారిన సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ ఉదంతం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. సుల‌భంగా డ‌బ్బులు సంపాదించొచ్చ‌న్న ఉద్దేశంతో.. భార్య‌తో ఏకాంతంగా గ‌డిపిన దృశ్యాల్ని అశ్లీల వెబ్‌ సైట్ కి అమ్మ‌కానికి పెట్టాడు. ఈ విష‌యాన్ని భార్యకు తెలీకుండా జాగ్ర‌త్త‌ప‌డి.. అమాయ‌కంగా న‌టించాడు.

త‌మ బెడ్రూం ముచ్చ‌ట్లు అశ్లీల వెబ్ సైట్లోకి ఎక్కేశాయ‌న్న విష‌యాన్ని తెలుసుకున్న స‌ద‌రు బాధితురాలు షాక్ తిని.. పోలీసుల్ని ఆశ్ర‌యించింది. రంగంలోకి దిగిన వారు.. అదంతా ఆమెనుక‌ట్టుకున్నోడు చేసిన పాడుప‌ని అన్న విష‌యాన్ని తేల్చ‌ట‌మే కాదు.. ఆమె భ‌ర్త ల్యాప్ టాప్ ఐపీ నుంచే ఇదంతా వెళ్లింద‌న్న విష‌యాన్ని గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఉదంతం ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టించ‌ట‌మే కాదు.. ఇది తెలిసిన వారంతా అస‌హ్యించుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News