హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ న్యూయార్క్‌లో కన్నుమూశారు. బోడుప్పల్‌కు చెందిన శ్రీధర్ పానుగంటి.. టెక్ మహీంద్రా (అమెరికా)లో ఉద్యోగం చేస్తున్నారు. న్యూయార్క్ బఫెలోలోని స్లేట్ క్రీక్ డ్రైవ్‌లోని ఓ ఆపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. అయితే శ్రీధర్ భార్య ఝాన్సీ రాణి, కుమారుడు (5) గత జవవరిలో ఇండియాకు వచ్చారు. కరోనా లాక్‌డౌన్‌తో ఇండియాలోనే ఉండిపోయారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శ్రీధర్ ఇండియాకు వచ్చి భార్యపిల్లలను తీసుకెళ్తానని చెప్పాడు. కానీ ఇంతలోనే శ్రీధర్ మృతిచెందారు. అయితే అతడు ఎలా మృతిచెందాడన్న విషయంపై క్లారిటీ లేదు. నవంబర్ 27 నుంచి శ్రీధర్ ఫోన్ తీయడం లేదు. అతడి స్నేహితులకు, కొలిగ్స్‌కు ఫోన్‌చేసిన తెలియదని చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన శ్రీధర్ తల్లిదండ్రులు, అతడి భార్య అమెరికాలోని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు న్యూయార్క్‌లోని శ్రీధర్ ఇంటిని తనిఖీ చేయగా .. విషయం బయటపడింది. నవంబర్ 27న రాత్రి అతడు చనిపోయినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఎలా చనిపోయాడన్న విషయం ఇంకా తెలియదు. విచారణ కొనసాగుతున్నది. శ్రీధర్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేలా చూడాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. ఈ విషయంపై భారతవిదేశాంగశాఖ.. న్యూయార్క్‌లోని భారత కాన్సలేట్ జనరల్‌కు లేఖ రాసింది.