అమ్మ మేనకోడలు దీప మరోసారి నోరు విప్పారు. గతంలో అమ్మ మరణంపై తనకు ఎలాంటి అనుమానాలు లేవని చెప్పిన ఆమె.. ఇప్పుడు అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.అమ్మకు చేసిన వైద్యంపై అపోలో వైద్యులు ఇచ్చిన వివరణ సరిపోదని.. తమకింకా చాలా అనుమానాలు ఉన్నాయని ఆమె చెబుతున్నారు. అమ్మ మృతి మీద అనుమానాలు వ్యక్తంచేసిన ఆమె.. తమ సందేహాలకు సమాధానాలు చెప్పాలన్నారు.
అనారోగ్యంతో ఆసుపత్రి చేరిన అమ్మను కలిసేందుకు తాను ప్రయత్నిస్తే.. తనను అనుమతించలేదన్న విషయాన్ని గుర్తు చేసి దీప.. శశికళను తమిళ ప్రజలు సీఎం కావాలని అనుకోవటం లేదని చెప్పారు. అమ్మకు అసలుసిసలు వారసురాలిని తాను మాత్రమేనని తేల్చి చెప్పిన ఆమె.. తాను త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని.. కొత్త రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించారు.
అమ్మ బరిలోకి దిగిన ఆర్కే నగర్ నుంచి తాను పోటీ చేయనున్నట్లు వెల్లడించిన దీప.. తన కొత్త పార్టీ వివరాల్ని ఈ నెల 24న ప్రకటించనున్నట్లు వెల్లడించారు. అమ్మ ఆశయ సాధన కోసం పోరాడతానని చెప్పిన ఆమె.. శశికళ ముఖ్యమంత్రి కావాలనుకోవటం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆమెను సీఎంగా తమిళ ప్రజలు అస్సలు కోరుకోవటం లేదంటూ మండిపడ్డారు.