వసుంధర రాజె ప్లేసులో మాజీ హీరోయిన్?

Update: 2018-07-27 05:45 GMT
రాహుల్ గాంధీ కోరుకుంటున్న ప్రధాని పదవిపై మాయవతి, మమతా బెనర్జీ కన్నేసిన విషయమే దేశంలో హాట్ టాపిగ్గా మారగా.. సందట్లో సడేమియా అంటూ మరో మహిళా నేత కూడా తన కుర్చీ రాజకీయాలను ప్రారంభిస్తున్నారు. అయితే.. ఈమె ప్రధాని పీఠం వంటి పెద్దపెద్ద లక్ష్యాలు పెట్టుకోలేదు. ఏదో రాజస్థాన్ సీఎం కుర్చీ దొరికితే చాలని అనుకుంటున్నారట. ఆమె ఎవరో కాదు... బాలీవుడ్ డ్రీంగాళ్ హేమామాలిని.
   
బీజేపీ ఎంపీ హేమమాలిని సీఎం కుర్చీపై కన్నేశారు.  తాజాగా రాజస్థాన్ మీడియాతో ఆమె చెప్పిన మాటలు అందుకు ఊతమిస్తున్నాయి. సినిమాతో వచ్చిన ఫేమ్ వల్లే ఎంపీ అయ్యానని, రేపటి రోజున మరో పెద్దపదవి దక్కినా ఆశ్చర్యంలేదని హేమమాలిని అంటోంది. ముఖ్యమంత్రి కుర్చీ మీద తనకు ఆసక్తి లేనప్పటికీ.. తాను తలచుకుంటే సీఎం సీటును సాధించడం కష్టమేమీకాదని వ్యాఖ్యానించడంతో కొత్త అంచనాలు మొదలయ్యాయి.
   
కాగా హేమమాలిని 2014లో మధుర నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి లోక్‌ సభలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో వార్తల్లో నిలిచింది. బీజేపీ చరిష్మాటిక్ లీడర్లలో ఒకరైన ఆమెను ఈసారి రాజస్థాన్ ఎన్నికల్లో ప్రచారంలో ముందువరుసలో నిలబెట్టనున్నట్లు సమాచారం.   త్వరలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత సీఎం వసుంధరరాజె మీద పార్టీ లోపలా బయటా తీవ్ర అసంతృప్తి నెలకొన్న నేపథ్యలో హేమ మాటలు కొత్త ఈక్వేషన్లకు అవకాశమిచ్చాయి.

Tags:    

Similar News