టీఆర్ఎస్ లో అంతా స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడుతారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ బాంబు పేల్చారు. రాసిచ్చింది మాట్లాడడం తప్ప సొంతంగా మాట్లాడే అధికారం ఎవ్వరికీ లేదని హాట్ విమర్శలు చేశారు. మంగళవారం ఈటల విలేకరులతో మాట్లాడారు.
20 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీలో చాలా చూశానని.. అందరి లిస్ట్ నా దగ్గరి ఉందని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులుగా కాకుండా.. మనుషులుగా మాట్లాడాలని హితవు పలికారు.కనీసం ఆ మంత్రులకు అయినా ఇక నుంచి కేసీఆర్ గౌరవం ఇవ్వాలని కోరుతున్నానని.. ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇస్తారని ఆశిస్తున్నానని ఈటల రాజేందర్ అన్నారు.
ఇక టీఆర్ఎస్ లోని ఎవ్వరి గురించి తాను కామెంట్ చేయనని ఈటల చెప్పుకొచ్చారు. నన్ను ఈ స్థానంలోకి తీసుకొచ్చింది టీఆర్ఎస్.. సీఎం కేసీఆర్ అని.. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేయలేదని అన్నారు. మంత్రి కేటీఆర్ సీఎం అభ్యర్థిత్వాన్ని తాను వ్యతిరేకించలేదని అన్నారు. కేటీఆర్ సీఎం కావాలని స్వాగతించానని అన్నారు. నాపై కక్ష సాధించడం సరికాదని.. ఎవరి మాటలపై స్పందించను అని.. నాతో ఎవరేం మాట్లాడారో తెలుసు అంటూ ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంకు ఇంత అహంకారం ఉంటదా అని వారే అన్నారని ఈటల పేర్కొన్నారు.