కమల్ హాసన్-పవన్ రాజకీయాల్లో తేడా ఇదే..

Update: 2018-09-16 10:45 GMT
తమిళ రాజకీయాల్లో కమల్ హాసన్ ప్రవేశించారు. అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నా సరే సినిమాలు - కళారంగాన్ని వదులుకోనని స్పష్టం చేస్తున్నారు. తాజాగా చెన్నైలోని సీఎంసీ మెడికల్ కాలేజీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు సేవ చేసేందుకే పార్టీని స్థాపించానని తెలిపారు. పార్టీని నడిపించడానికి డబ్బు కావాలని.. ఆ డబ్బు కోసమే సినిమాల్లో నటిస్తానని కమల్ స్పష్టం చేశారు. సినిమాల్లో నటించినప్పటికీ తన దృష్టంతా రాజకీయాలు - ప్రజాసేవ పైనే ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని కోరారు.

తెలుగు సినిమాల్లో అగ్రహీరోగా వెలుగొంది రాజకీయాల్లోకి వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పగా.. కమల్ మాత్రం సినిమాలను వదిలేది లేదని.. సినిమాలు-రాజకీయాలు రెండిటిలోనూ రాణిస్తానని చెప్పడం విశేషం. అంతేకాదు.. రాజకీయ ఖర్చుల కోసమే సినిమాలు చేస్తున్నానని కమల్ తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కూడా ఇలా ఆలోచిస్తే ఆయనకు విరాళాలు తీసుకునే ఖర్మ తప్పుతుంది కదా అని పలువురు సూచిస్తున్నారు. మరి జనసేనాని.. కమల్ హాసన్ లాగా తన పంథా మార్చుకుంటాడా లేదా అన్నది వేచి చూడాలి.
Tags:    

Similar News