రతన్ టాటా ను రాష్ట్రపతిగా ప్రతిపాదిస్తున్నాను: నాగబాబు

Update: 2021-08-09 12:30 GMT
మెగా బ్రదర్‌ సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌ గా ఉంటూ.. నిత్యం ఏదోక అంశం మీద తనదైన శైలిలో స్పదిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఆయన చేసే కొన్ని కామెంట్స్ సంచలనం అయితే.. మరికొన్ని వివాదాస్పదం కూడా అవుతుంటాయి. ఇప్పుడు తాజాగా దేశ ప్రథమ పౌరులు రాష్ట్రపతి అంశంపై స్పందించి వార్తల్లో నిలిచారు నాగబాబు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుందని.. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని ప్రేమించే వ్యక్తి రాష్ట్రపతిగా ఉండాలని పేర్కొన్న నాగబాబు.. రాష్ట్రపతిగా ప్రముఖ వ్యాపారవేత్త రతన్‌ టాటా పేరును సూచించి అందరిని ఆశ్చర్యపరిచారు.

''ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులును ఎదుర్కొంటోంది. రోజు రోజుకు పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేసే వారు, వ్యూహాత్మకంగా వ్యవహరించే వారు కాకుండా.. పెద్ద మనసుతో దేశం మొత్తాన్ని ఒక కుటుంబంలా భావించి ప్రేమించే వ్యక్తి తదుపరి రాష్ట్రపతిగా ఉండాలి. భారత దేశ తదుపరి రాష్ట్రపతిగా రతన్‌ టాటా గారిని నేను ప్రతిపాదిస్తున్నాను'' అని నాగబాబు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. దీనికి #RatanTataforPresident అనే హ్యాష్‌ ట్యాగ్‌ పెట్టి రతన్ టాటా ఫోటోని కూడా జోడించారు

ప్రస్తుతం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం ఇంకా మరో ఏడాది పైగా ఉంది. మరి ఇప్పుడు ఉన్నట్టుండి మన దేశంలోనే అతి పెద్ద వ్యాపారవేత్త అయిన రతన్ టాటా ను రాష్ట్రపతి గా ప్రతిపాదించడంపై మెగా బ్రదర్ నాగబాబు ఉద్దేశ్యం ఏమిటో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News