ఐఏఎస్ ఇంట్లో రూ.10 కోట్లు, 10 కేజీల గోల్డ్!

Update: 2017-04-21 08:03 GMT
సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి ఇంట్లో ల‌భ్య‌మైన అక్ర‌మ సంపాద‌న ఐటీ శాఖ వ‌ర్గాల‌ను షాక్‌ కు గురిచేసింది. నోయిడాలోని ఉత్తరప్రదేశ్ క్యాడర్‌ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కేశవ్‌ లాల్ ఇళ్ల‌పై ఆదాయం పన్నుశాఖ అధికారులు దాడి చేయ‌గా క‌ళ్లు బైర్లు క‌మ్మే రీతిలో అక్ర‌మ సొమ్ము బ‌య‌ట‌ప‌డింది. 10 కోట్ల నగదు - 10 కేజీల బంగారం - కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఆయ‌న ఇళ్ల‌ల్లో త‌నిఖీలు జ‌రుగుతున్నాయి.

ప్ర‌స్తుతం కేశవ్‌ లాల్ కాన్పూర్ పరిధిలో అమ్మకం పన్ను విభాగంలో అదనపు కమిషనర్‌ గా పనిచేస్తున్నారు. ఆయన గతంలో నోయిడా ప్రాధికార సంస్థ ఓఎస్డీగా పనిచేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేశవ్‌ లాల్‌ కు సంబంధించిన నాలుగు ఇళ్ల‌పై ఆదాయం పన్ను అధికారులు దాడులు చేయ‌గా... 10 కోట్ల నగదు - 10 కేజీల బంగారం - కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఉన్నతాధికారి తెలిపారు. గత మూడు రోజులుగా ఉత్తరప్రదేశ్ - ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లోని ఐఏఎస్ అధికారుల ఇండ్లల్లో ఆదాయం పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని ఆయ‌న తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News