ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డ్రీం టీంలో తెలుగు ఐఏఎస్‌కు కీలక స్థానం దక్కింది. క్రమశిక్షణకు మారుపేరైన ఐఏఎస్ ఆఫీసర్ బి.చంద్రకళకు ఈ అవకాశం దక్కింది. ఆమె ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లా కలెక్టర్ - జిల్లా మెజిస్ట్రేట్ గా ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ గా ఫైర్ బ్రాండ్ అన్న ఇమేజ్ ఈమెకు ఉంది. ఇప్పుడు ఈమె ప్రధాని మోడీ డ్రీమ్ టీమ్ లో చోటు సంపాదించారు. 2008వ బ్యాచ్ కు చెందిన యూపీ క్యాడర్ ఆఫీసర్ రెండేళ్ల క్రితం సంచలనంగా మారారు. నాసిరకం రోడ్లు వేసిన కాంట్రాక్టర్లు - మున్సిపల్ అధికారులపై ఆమె ఓసారి సీరియస్ అయ్యారు. ఆ ఘటన సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ గా మారి నిజాయితీ గల ఆఫీసర్ అన్న పేరు తెచ్చుకుంది.
ఇప్పుడు ఆ ఆఫీసర్ కు ప్రధాని మోడీ అరుదైన గుర్తింపు ఇచ్చారు. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ కు ఐఏఎస్ ఆఫీసర్ చంద్రకళను డైరక్టర్ గా నియమించారు. మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ శాఖలోను ఆమెకు ఉప కార్యదర్శి బాధత్యలను అప్పగించారు. బులందర్ షెహర్ - బిజ్నూర్ - మీరట్ నగరాల్లో క్లీన్ ఇండియా ప్రచారాన్ని ఆమె సక్సెస్ ఫుల్ గా నిర్వహించారు. ఐఏఎస్ చంద్రకళది స్వంత రాష్ట్రం తెలంగాణ. కాగా, ఆమె క్రమశిక్షణ విషయంలోనూ కఠినంగా ఉంటారు. బులంద్ షహర్ కలెక్టర్ గా ఉన్న సమయంలో ప్రజా ఫిర్యాదుల విభాగంలో భాగంగా ఆర్జీలు స్వీకరిస్తున్నపుడు స్థానిక కమల్ పూర్ గ్రామస్థులు తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. వారి సమస్యలను కలెక్టర్ చంద్రకళ ఆలకిస్తుండగా కమల్ పూర్ కే చెందిన ఫరద్ అహ్మద్ అనే 18ఏళ్ల యువకుడు సెల్ఫీ పేరిట అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. కలెక్టర్ తో సెల్ఫీ తీసుకుంటానంటూ మీదిమీదికి వచ్చాడు. గ్రామస్థులు తమ సమస్యలు చెప్తుంటే సెల్ఫీ కోసం ఎగపడటం తగదని ఫరద్ అహ్మద్ ను కలెక్టర్ వారించారు.
అయినా ఆ యువకుడు వినలేదు. అదే పనిగా తన సెల్ ఫోన్ తో కలెక్టర్ తో సెల్ఫీలు తీసుకుంటూనే ఉన్నాడు. అనుమతి లేకుండా సెల్ఫీలు తీసుకోవడం మంచిది కాదు. పైగా నేను ఓ మహిళనన్న విషయం గుర్తుంచుకో. ఆ ఫొటోలు తొలగించు అని కలెక్టర్ చెప్పినా ఆ కుర్రాడు వినలేదు. ఇష్టం వచ్చినట్టుగా ఆ యువకుడు ప్రవర్తించడంతో కలెక్టర్ ఆగ్రహించి, అరెస్టుకు ఆదేశించారు. అప్రమత్తమైన పోలీసులు ఆ యువకుడ్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/