ఇద్దరు పెళ్లాల మంత్రి పీఏ రియల్ రచ్చ

Update: 2016-05-03 09:54 GMT
ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ సినిమాతో పాటు రుతురాగాలు లాంటి సీరియల్స్ లో నటించిన నటి పూజిత రియల్ కథ ఇది. రీల్ లైఫ్ మాదిరే చిత్రవిచిత్రమైన ఇబ్బందిని ఆమె ఎదుర్కొంటోంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలపై రచ్చకెక్కిన ఆమె తన భర్త తనను మోసం చేశాడని.. మరో ఐఏఎస్ అధికారిణిని పెళ్లాడారంటూ ఆరోపిస్తున్నారు. ఈ ఉదంతాన్ని ఒక మీడియా ఛానల్ ప్రత్యేకంగా ప్రసారం చేయటంతో ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక.. ఈ ఉదంతాన్ని కుప్లంగా చెప్పాలంటే..

మంత్రి దగ్గర పీఏగా పని చేసే విజయ్ గోపాల్ ను తాను పెళ్లాడినట్లుగా సినీ నటి పూజిత చెబుతున్నారు. అతడు తనను మోసం చేసి తాజాగా ఐఏఎస్ అధికారిణి.. ప్రస్తుతం శాప్ ఎండీగా వ్యవహరిస్తున్న రేఖారాణిని రెండోపెళ్లి చేసుకున్నట్లుగా ఆరోపిస్తున్నారు. తనకు న్యాయం చేయాలని అధికారుల వద్దకు వెళితే.. ఎన్ కౌంటర్ చేస్తానని హెచ్చరిస్తున్నట్లుగా ఆరోపించారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తాను మీడియా ముందుకు వచ్చినట్లుగా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నటి పూజిత వ్యాఖ్యల నేపథ్యంలో ఐఏఎస్ అధికారిణి రేఖారాణి సదరు ఛానల్ ముందుకు వచ్చి ఫోన్లో మాట్లాడారు. ఆమె వాదన ప్రకారం.. పూజిత.. విజయ్ గోపాల్ ఇద్దరూ పెళ్లి చేసుకోలేదని.. సహజీవనం చేశారని.. అది కూడా పదేళ్ల కింద వారిద్దరూ విడిపోయారని.. తాను అన్ని లీగల్ గా చూసుకొని మాత్రమే పెళ్లి చేసుకున్నట్లుగా వెల్లడించారు. వ్యక్తిగత అంశాలపై ఏదైనా తేడా ఉంటే.. కోర్టులో చూసుకోవాలే తప్పించి ఇలా మీడియాకు ఎక్కటం సరికాదని ఆమె చెబుతున్నారు.

పూజిత మాదిరే తాను కూడా మహిళనేనని.. ఆమె మోసపోయానని చెప్పటంపై తాను సానుభూతిగా ఉన్నానని.. ఆమె వాదన సరైనది అయితే పూజిత తరఫున తాను నిలుస్తానని చెప్పుకొచ్చారు. తన తల్లిదండ్రులు కూడా పూజిత తరఫున మాట్లాడటం బ్యాడ్ లక్ గా సదరు అధికారిణి వ్యాఖ్యానించటం గమనార్హం. తన తరఫు నుంచి పూజితకు ఎలాంటి అపాయం లేదని ఆమె భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా.. మంత్రి పీఏగా వ్యవహరిస్తున్న విజయ్ గోపాల్.. ఐఏఎస్ అధికారిణి రేఖారాణిల వివాహం మూడు రోజుల కిందటే జరిగినట్లుగా చెబుతున్నారు. గోల్కొండ రిజిస్ట్రార్ వాళ్ల ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇద్దరు పెళ్లాల భర్తగా వెలుగులోకి వచ్చిన విజయ్ గోపాల్ వెర్షన్ మాత్రం బయటకు రాలేదు. ఒక నటి.. ఒక ఐఏఎస్ అధికారిణి.. ఒక మంత్రి పీఏకు సంబంధించిన ఈ రియల్ రచ్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News