ఢిల్లీ లో ఐబీ అధికారి హత్య..పోస్ట్‌మార్టం రిపోర్ట్ లో బయటపడ్డ అసలు నిజం !
దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగిన విషయం తెలిసిందే. అలాగే మరోవైపు అనుకూలంగా కూడా మరికొందరు ర్యాలీలు చేయగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. దీనితో ఆందోళనలు కాస్త హింసాత్మకంగా మారాయి. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు 38 మంది మృతిచెందగా, వీరిలో ఓ కానిస్టేబుల్ తో పాటుగా ఐబీ అధికారి అంకిత్ శర్మ కూడా మరణించాడు. అయితే, ఐబి అధికారిని కొందరు దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. చాంద్ బాగ్ ప్రాంతంలో అంకిత్ శర్మ ఓ డ్రైనేజీల శవమై కనిపించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా దేశరాజధానిలో కలకలం రేగింది.
అయితే , ఈ ఐబి అధికారిని ఎవరో కొందరు కావాలనే హతమార్చి , డ్రైనేజీ లో పడేసారు అంటూ అతని తల్లిదండ్రులు ఆరోపించారు. ఇక తాజాగా అంకిత్ శర్మ మృతదేహానికి నిర్వహించిన పోస్ట్ మార్టంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. శర్మ శరీరంలో పలుచోట్ల గాయాలయ్యాయని, పదునైన ఆయుధం తో శరీరం లోపల చాలా లోతుగా కోతకు గురైందని, ఆయనను పలుమార్లు కిరాతకంగా కత్తిపోట్లకు గురిచేయడంతో మరణానికి దారితీసిందని అటాప్సీ నివేదికలో వైద్యులు పొందుపరిచారు.ఐబీలో 2017 నుంచి సెక్యూరిటీ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న అంకిత్ శర్మ కార్యాలయం నుంచి ఇంటికి వెళుతుండగా చాంద్‌బాగ్ లో అల్లరి మూకలు ఆయనను పాశవికంగా హత్య చేసి మృత దేహాన్ని డ్రైనేజ్ లో పడవేసి వెళ్లినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.